Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

హోంవర్క్ చేయలేదని టెన్త్ క్లాస్ విద్యార్థి పన్ను విరగ్గొట్టిన టీచర్.. అరెస్ట్

  • వేసవి సెలవులకు ముందు ఏప్రిల్‌లో హోం వర్క్ ఇచ్చిన టీచర్
  • వ్యక్తిగత కారణాలతో పూర్తి చేయలేకపోయానంటూ విద్యార్థి సమాధానం
  • సహనం కోల్పోయి దారుణంగా కొట్టి తోసేసిన ఉపాధ్యాయుడు

టెన్త్ క్లాస్ విద్యార్థి హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఓ ఉపాధ్యాయుడు దారుణంగా దండించాడు. ఎంతలా అంటే విద్యార్థి పన్ను (Teeth) ఒకటి విరిగిపోయింది. దెబ్బలు తాళలేక ఆ విద్యార్థి తరగతి గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 

వేసవి సెలవులకు ముందు ఏప్రిల్‌లో హోంవర్క్ ఇవ్వగా సదరు విద్యార్థి అది పూర్తి చేయకుండానే స్కూల్‌కు తిరిగొచ్చాడు. ఎందుకు చేయలేదని ప్రశ్నించగా.. వ్యక్తిగత కారణాల వల్ల చేయలేకపోయానంటూ విద్యార్థి సమాధానం ఇవ్వడంతో ఉపాధ్యాయుడు సహనం కోల్పోయి కొట్టాడు . కర్రతో తీవ్రంగా కొట్టడంతో పాటు బలవంతంగా తోసేశాడు. దీంతో విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడాన్ని గమనించిన ఉపాధ్యాయుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న హెడ్ మాస్టర్ విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

తండ్రి ఫిర్యాదు మేరకు నిందిత ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయడంతో పాటు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి ముఖం, నోటిపై గాయాలు అయ్యాయని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు సలోన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జేపీ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి స్పందిస్తూ.. తన కొడుకుని దారుణంగా కొట్టారంటూ వాపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లానని, ఒక రోజు చికిత్స అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేశారని వివరించారు.

Related posts

అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడీ ముప్పు తప్పేది! ఇండోర్ మెట్లబావి ప్రమాదంపై స్థానికులు!

Drukpadam

నగ్మా డబ్బులు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు!

Drukpadam

జకార్తా జైలులో ఘోర అగ్నిప్రమాదం… 41 మంది ఖైదీల సజీవదహనం!

Drukpadam

Leave a Comment