Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల క్యూలైన్‌లో ఫ్రాంక్ వీడియో… విజిలెన్స్ విచారణకు ఆదేశించిన టీటీడీ

  • దర్శన క్యూ లైన్లలో తమిళ ఆకతాయిల ఫ్రాంక్ వీడియో
  • నారాయణగిరి షెడ్స్‌లోని కంపార్ట్‌మెంట్ తాళాలు తీసేందుకు యత్నిస్తూ వీడియో
  • ఇన్‌స్టాగ్రాంలో వీడియో పోస్ట్… తమిళనాడులో ఆందోళనలు

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో తీశారు. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఈ క్రమంలో క్యూలైన్‌లోని నారాయణగిరి షెడ్స్‌ కంపార్ట్ మెంట్లో భక్తులు వేచివున్నారు. ఆ కంపార్ట్ మెంట్ తాళాలు తీస్తున్నట్లు హడావిడి చేస్తూ ఫ్రాంక్ వీడియో తీశాడు.  

అయితే అతను అలా చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న భక్తులు… వీరిని టీటీడీ సిబ్బందిగా భావించారు. తాళాలు తీస్తున్నారేమోనని ఆశగా చూశారు. కానీ వాసన్, అతని స్నేహితులు వెకిలిగా నవ్వుతూ అక్కడి నుంచి పరుగు తీశారు. చూస్తే అది ఫ్రాంక్ వీడియో.

దీనిని వారు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది. 

సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు ప్రవేశించే ముందే భక్తుల నుంచి సెల్ ఫోన్లు డిపాజిట్ చేయిస్తారు. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారు మ్రోగే తిరుమల కంపార్ట్‌మెంట్‌లలో ఆకతాయిలు చేసిన ఫ్రాంక్ వీడియోపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ అమితాబ్‌, నాగార్జున‌..

Drukpadam

‘బ‌ద్వేలులో దొంగలు, పోలీసులు ఒక్క‌ట‌య్యారు’ అంటూ సి.ఎం ర‌మేశ్ ఆగ్ర‌హం.. 

Drukpadam

ఉత్తరాంధ్రలో కుండపోత.. విశాఖ, విజయవాడలో విరిగిపడిన కొండచరియలు…

Ram Narayana

Leave a Comment