Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన జస్టిస్ నరసింహారెడ్డి

  • ఇప్పటి వరకు ప్రతి కమిషన్ ప్రెస్ మీట్ పెట్టిందన్న నరసింహారెడ్డి
  • తాను ప్రెస్‌మీట్‌లో ఎలాంటి అంశాలను బయటపెట్టలేదని వెల్లడి
  • కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ ప్రెస్ మీట్లు పెడుతుందని వ్యాఖ్య 

కమిషన్ అంటేనే ఓపెన్ ఎంక్వయిరీ అని… కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ ప్రెస్ మీట్లు పెడుతుందని జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను వేసింది. దీనిపై కేసీఆర్ కోర్టుకు వెళ్లడంతో ఈరోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. కొత్త కమిషన్‌ను నియమించాలని ఆదేశించింది. దీంతో నరసింహారెడ్డి తప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ… ఈ వివాదానికి తన ప్రెస్ మీట్ కారణమని చెబుతున్నారని… కానీ ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్న ఒక్క విచారణ కమిటీనైనా చూపించాలన్నారు. షా కమిషన్ వంటివి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాయన్నారు. 

సుప్రీంకోర్టు ప్రాథమిక వాదోపవాదనలు మాత్రమే విన్నదని పేర్కొన్నారు. ఇంకాస్త లోతుగా విచారించి ఉంటే తాను ప్రెస్ మీట్‌లో అభిప్రాయం చెప్పానో లేదో తెలిసేదన్నారు. తన ప్రెస్‌మీట్‌లో ఎలాంటి అంశాలను బయటపెట్టలేదన్నారు. లోతైన విచారణ వద్దని కోర్టు భావించినట్లుగా ఉందన్నారు. తాను మాత్రం అభిప్రాయం చెప్పలేదన్నారు.

అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పుపై తాను ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేదన్నారు. అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ ప్రెస్ మీట్లు పెడుతుందని తాను ఇప్పటికీ చెబుతున్నానన్నారు. కమిషన్ అంటేనే ఓపెన్ ఎంక్వయిరీ అని అర్థమని పేర్కొన్నారు. అసలు కమిషన్ ప్రెస్ మీట్లు పెడితే తప్పేమిటన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి తాను ఎలాంటి అంశాలు బయటపెట్టలేదన్నారు.

Related posts

పాకిస్థాన్ లో ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి… 30 మంది మృతి!

Drukpadam

పునీత్ మరణానికి దారి తీసిన కార్డియాక్ అసిస్టోల్..అంటే ఏమిటీ?

Drukpadam

వైసీపీ ఎంపీపై లోక్ సభ స్పీకర్ ప్రశంసల జల్లు!

Drukpadam

Leave a Comment