Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రైతుబంధు నిధులు రుణమాఫీకి మళ్లించారు …కేటీఆర్ ఆగ్రహం …

రుణమాఫీ పేరిట మరోసారి రాష్ట్ర రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు….రైతుబంధు కింద జూన్ లో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు కొడుతున్నారని విమర్శించారు. 40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా అంటూ నిలదీశారు. 2014లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చిందన్నారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అన్నారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్ని వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు… అర్హులైన రైతులందరికీ రైతుబందు వెంటనే విడుదల చేయాలన్నారు..

Related posts

 బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడంపై పవన్ కల్యాణ్ వివరణ

Ram Narayana

బీఆర్ యస్ 105 మంది అభ్యర్థుల ప్రకటించే ఛాన్స్ …! ఉండేదెవరు / ..ఊడేదెవరు …?

Ram Narayana

ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు వట్టి మాటే: హరీశ్ రావు

Ram Narayana

Leave a Comment