తెలంగాణ వార్తలు

పెద్ద వాగు కొట్టుకోవడంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ్రహం..

పెద్ద వాగు కొట్టుకోవడంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ్రహం
నలుగురు అధికారులకు మెమోలు
వర్షాలకు ముందు డ్యామ్ సేఫ్టీ గురించి ఎందుకు పరిశీలన చేయలేదని ప్రశ్న
తక్కువ సంఖ్యలో ఉద్యోగులు పనిచేయడంపై ఆరా ..

వర్షకాలనికి ముందు పెద్దవాగు ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి అని తనిఖీలు చేశారా?? పెద్దవాగుకు సంబంధించిన సమగ్ర వివరాలు మరియు ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకపోవడానికి గల కారణాలు పై నివేదిక ఇవ్వండి.. – జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ

ప్రాజెక్టు పరిధిలో 30 మంది పని చేయాల్సి ఉండగా కేవలం 10 మందే పని చేసినట్టు సమాచారం..

పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారు అని ఈఈ సురేష్ కుమార్, డీఈఈ కృష్ణ, ఏఈఈ కృష్ణ మరియు ఇంకో ఇతర అధికారి పై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీ కి లేఖ రాసిన భద్రాద్రి జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి. వెంటనే అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం …దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అంటున్న అధికార వర్గాలు

Related posts

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వచ్చే నెలలో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం

Ram Narayana

తెలంగాణలో మరొకరిని బలితీసుకున్న ఏనుగు.. గజరాజు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు.. చట్టబద్ధమే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana