Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ సీఎం జగన్ , అమిత్ షా తో భేటీ రద్దు అయిందని పెద్ద ఎత్తున వార్తలు …కాని గంటన్నర భేటీ

ఏపీ సీఎం జగన్ , అమిత్ షా తో భేటీ రద్దు అయిందని పెద్ద ఎత్తున వార్తలు …కాని గంటన్నర భేటీ
-కేంద్ర హోమ్ మంత్రి ,ఏపీ సీఎం మధ్య గంటన్నర సమావేశం
-ఢిల్లీలో జగన్ బిజీబిజీ.. కేంద్ర మంత్రులకు జగన్ పలు విన్నపాలు
-హైకోర్టును కర్నూలులో పెడుతూ రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి
-ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలన్న సీఎం
-తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.5,541.88 కోట్లను ఇప్పించాలని విన్నపం
-రూ.55,656.87 కోట్ల పోలవరం అంచనాలకు ఆమోదం తెలపాలని కేంద్రమంత్రి షెకావత్‌కు అభ్యర్థన
-ప్రకాష్ జవదేకర్ ,నీతిఆయోగ్ చైర్మన్ తో సమావేశం
-నేడు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో సమావేశం
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై రకరకాల ప్రచారం డిబేట్లు జరిగాయి. ఢిల్లీ పర్యటన లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో జరగలిసిన భేటీ రద్దు అయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.జగన్ కు కలిసేందుకు అమిత్ షా ఇష్ట పడటం లేదని తెలుగు ఛానల్లో లో వార్తలు డిబేట్లతో అదరగొట్టారు . ఆయన షడ్యూల్ ప్రకారం రాత్రి 9 గంటలకు అమిత్ షా తో జరగాల్సిన సమావేశం రద్దు అయిందని కొన్ని చానళ్ళు డిబేట్లు సహితం నిర్వహించాయి. అసలు ముఖ్యమంత్రి జగన్ కు హోమ్ మంత్రి అపాయింట్ మెంట్ లేకుండానే ఢిల్లీ వెళ్లారని ఆయన బైయిల్ రద్దు కేసు కోర్ట్ లో పెండింగ్ లో ఉందని అందువల్ల జగన్ కలిసేందుకు అమిత్ ఇష్టపడటంలేదని టీవీ ఛానళ్లవారు ,డిబేట్లు పాల్గొన్న వారు ఒకటే పనిగా చెప్పటం ప్రారంభించారు. అయితే ఇందుకు విరుద్ధంగా ఢిల్లీలో జగన్ అనుకున్న టైం ప్రకారం రాత్రి 9 గంటల నుంచి 10 .30 గంటల వరకు హోమ్ మంత్రి తో సమావేశం జరగడంతో జగన్ పర్యటనపై ప్రచారంకొందరు చేసిన దుష్ప్రచారంపై వైసీపీ వర్గాలు భగ్గుభగ్గు మంటున్నాయి. ఢిల్లీ పర్యటనలో జగన్ పర్యటన తీరికలేకుండా సాగింది. …. amt
నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడిపారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలుసుకున్న జగన్.. దాదాపు గంటన్నరపాటు ఆయనతో చర్చించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్టణం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ గతేడాది చట్టాన్ని తీసుకొచ్చామని, కాబట్టి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తూ రీ నోటిఫికేషన్ జారీ చేయాలని అమిత్ షాను కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా గ్రాంట్లు వస్తే రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.

తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.5,541.88 కోట్లను ఇప్పించాలని అభ్యర్థించారు. విశాఖలోని అప్పర్ సీలేరు రివర్స్ పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుకు అయ్యే రూ. 10,445 కోట్ల వ్యయంలో 30 శాతం నిధులు సమకూర్చాలని కోరారు. 14, 15వ ఆర్థిక సంఘం బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దిశ బిల్లును ఆమోదించాలని, విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో తాము గుర్తించిన 250 ఎకరాల స్థలంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అమిత్ షాను జగన్ కోరారు.

కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల అమలుపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని, రూ.55,656.87 కోట్ల పోలవరం అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. నిధుల చెల్లింపులో జాప్యం జరగకుండా చూడాలని షెకావత్‌ను జగన్ కోరారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరారు.

జగన్‌మోహన్‌రెడ్డి నేడు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌లతో సమావేశం అవుతారు.

Related posts

రాజమండ్రి సభలో వైసీపీ పై పవన్ కళ్యాణ్ నిప్పులు …నార తీస్తానని వార్నింగ్ !

Drukpadam

కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తున్న శాసనసభ …సింహగర్జన చేస్తున్న భట్టి ..

Ram Narayana

హుస్నాబాద్ ఎమ్మెల్యే స‌తీశ్ కుమార్‌కు చేదు అనుభ‌వం!

Drukpadam

Leave a Comment