Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రెండుసార్లు సీఎంగా అవకాశం వచ్చినా నేను తీసుకోలేదు: వి హనుమంతరావు

తనకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ తీసుకోలేదని… తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ కోసమే పని చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనకు ఓబీసీ కన్వీనర్‌గా అవకాశమిస్తే దేశమంతా తిరుగుతానన్నారు.
దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతానన్నారు.

రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాలనేది తమ ఏకైక లక్ష్యమన్నారు. నిన్న ఏఐసీసీ మీటింగ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లి కార్జున ఖర్గే లు కులగణన చేయాలని చెప్పారని తెలిపారు. కులగణన జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందనేది రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. కులగణన 1931 తర్వాత మళ్లీ జరగలేదన్నారు.

బీజేపీ తప్ప మిగతా రాజకీయ పార్టీలన్నీ కులగణన చేయాలని చెబుతున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన బిల్లు పెట్టారని గుర్తు చేశారు. కులగణన కోసం రూ.150 కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయించారన్నారు. ఓబీసీ ఎంపీల కన్వీనర్‌గా కోట్లాడి ఐఐటీ, ఐఐఎమ్‌లలో రిజర్వేషన్‌ను తీసుకొచ్చానని తెలిపారు. ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.

Related posts

బీఆర్ఎస్ నేతల కోసమే నిర్మల్ మాస్టర్ ప్లాన్… రద్దు చేయకపోతే నిరసనలే: ఈటల

Ram Narayana

నాకు ఇప్పటి వరకు ఓటమి తెలియదు… గజ్వేల్‌లో ఓడాక కసి మరింతగా పెరిగింది: ఈటల

Ram Narayana

తెలంగాణలో లోక్ సభలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు…? టైమ్స్ నౌ సర్వే

Ram Narayana

Leave a Comment