Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు: రేవంత్ రెడ్డి

  • అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీశ్ రావును నియమిస్తారన్న రేవంత్
  • కవితకు బెయిల్ కూడా వస్తుందని వ్యాఖ్య
  • కవితను రాజ్యసభకు పంపుతారని జోస్యం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని చెప్పారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవిని బీజేపీ ఇస్తుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీశ్ రావు నియమితులవుతారని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితకు బెయిల్ కూడా వస్తుందని… విలీనంలో భాగంగా ఆమెను రాజ్యసభకు పంపుతారని అన్నారు. బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని… వీరి అవసరం బీజేపీకి ఉందని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts

హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం.. హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు..!

Drukpadam

ఛోటా చంద్రబాబు’ అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు..!

Drukpadam

ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరికకు అడ్డుపడాలని లేదు: గవర్నర్ తమిళసై

Ram Narayana

Leave a Comment