Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎంటర్టైన్మెంట్ వార్తలు

నేను ఎక్కడికైనా వెళ్తా.. నా లైఫ్ నా ఇష్టం: హేమ

  • తాను బెంగళూరు పార్టీకి హాజరయ్యానన్న హేమ
  • ఆ మరుసటి రోజు ఏం జరిగిందో తనకు తెలియదని వ్యాఖ్య
  • టెస్టులో పాజిటివ్ వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపాటు

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమ పాల్గొన్నారనే వార్త సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 19, 20 తేదీల్లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఎండీఎంఏ, కొకైన్ వంటి డ్రగ్స్ వాడినట్టు పోలీసులు గుర్తించారు. హేమకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో హేమ జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యారు. 

ఇదే అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ…  తాను బెంగళూరు పార్టీకి హాజరైన మాట నిజమేనని చెప్పారు. బర్త్ డే పార్టీ జరుపుకుంటున్న వ్యక్తి తన బ్రదర్ లాంటి వాడని… అందుకే ఆయన పిలిస్తే వెళ్లానని తెలిపారు. తాను శనివారం జరిగిన పార్టీకి వెళ్లానని, ఆదివారం ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. తాను ఇంకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదని… కానీ టెస్టుల్లో తనకు పాజిటివ్ వచ్చిందంటూ ఓ మీడియా ఛానల్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు.

తాను ఎక్కడికైనా వెళ్తానని, తన జీవితం తన ఇష్టమని… తనను ప్రశ్నించే హక్కు మీకెక్కడిదని హేమ అన్నారు. తాను తప్పు చేయలేదని కోర్టే చెపుతుందని… అయితే, కోర్టు వ్యవహారాలు తొందరగా తేలవని చెప్పారు. తన సభ్యత్వాన్ని ‘మా’ రద్దు చేయడంపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు.

Related posts

ఆవేళ చిరంజీవి డ్యాన్స్ చూశాక సినిమాలు నా వల్ల కాదనిపించింది: నాగార్జున

Ram Narayana

16 రోజుల దేవర వసూళ్లను అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌!

Ram Narayana

గాయని మంగ్లీకి విశిష్ట పురస్కారం

Ram Narayana

Leave a Comment