Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మాన్ని ముంచిన మున్నేరు …జలదిగ్బంధనంలో పలు కాలనీలు

ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద ముంచింది… గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం నగరాన్ని అనుకోని ప్రవహిస్తున్న మన్నేరుకు పై ఉన్న చెరువులు గండ్లు పడటంతో ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చిన వరద మున్నేరుకు ఇరువైపులా ఉన్న కాలనీలను ముంచెత్తింది … ఫలితంగా ఖమ్మంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి..ఇళ్లలోకి నీరు చేరుకుంది .. దీంతో ప్రజలు లబోదిబో మంటూ ఇళ్లను ఖాళీ చేసి తలదాచుకుందేందుకు పరుగులు పెట్టారు. కొందరు తమ ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం అరుపులు కేకలు వేశారు … గత మూడు దశాబ్దాల కాలంలో మున్నేరు ఇలాంటి వాదన చూడలేదని నగరవాసులు చెప్పుకుంటున్నారు. లక్షలాది క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా వచ్చి పడటంతో తట్టుకోలేని మున్నేరు దారులు వెతుక్కుని జనావాసాలపై పడింది .. మున్నేరుకు అనుకొని ఉన్న ఖమ్మం నగరంలోని మూడో పట్టణం రెండో పట్టణంలోని ప్రాంతాలు జలదిగ్బంధనంలో మునిగిపోయాయి . అదేవిధంగా పాలేరు నియోజకవర్గ పరిధిలోని కరుణగిరి టి ఎన్జీవోస్ కాలనీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ లు పూర్తిగా నీట మునిగాయి. అనేక కుటుంబ హలో లక్షణా అంటూ పిల్లాపాపలతో బిక్కుబిక్కుమంటూ మెడలు ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు కన్నీటిని తెప్పించాయి. అనేక ప్రాంతాలను వరదలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో సహాయక చర్యలు చేసేందుకు ప్రభుత్వా యంత్రాంగానికి కూడా పాలుపోని పరిస్థితి ఏర్పడింది … మూడు నియోజకవర్గాలు పరిధిలో భారీ నష్టం సంభవించింది. ప్రజలు జిల్లాకు ఉన్న ముగ్గురు మంత్రులేరి ఎక్కడ అంటూ ప్రశ్నించారు ..సోషల్ మీడియా లో మంత్రులను తిడుతున్న తిట్లు హల్చల్ చేశాయి .. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది వరద ప్రవాహంలో విరుక్కున్నారని తెలియటంతో వారిని రక్షించేందుకు ఇటు ప్రభుత్వ యంత్రాంగం అటు ఎన్డీఏ బృందాలు ప్రయత్నాలు చేసినప్పటికీ రాత్రి పొద్దుపోయే వరకు వారిని బయటికి తీయడం అసాధ్యంగా మారింది .. హెలిక్యాప్టర్ల ద్వారా వారిని తీసుకోని రావాలని ప్రభుత్వం ప్రయత్నం ఫలించలేదు .. ప్రైవేట్ సంస్థల వారు వాతావరణం అనుకూలించక ఇక్కడకు వచ్చేందుకు ససేమీరా అన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కొంత ప్రయత్నం చేసి తర్వాత చేతులెత్తేశాయి. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన స్థానిక శాసనసభ్యుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు పై కారాలు మిరియాలు నూరారు తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినదించారు సాయంత్రం ఖమ్మానికి వరదల ఉధృతిని పరిశీలించేందుకు హుటాహుటిన వచ్చిన రెవిన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు , ఖమ్మం లోని జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు ఖమ్మం నుంచి సూర్యాపేటకు వెళ్లే మార్గంలో పాలేరు వద్ద హైవే రోడ్డుకు గండిపడటంతో అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఆయన స్వయంగా మోటార్ సైకిల్ పై తిరిగి వరద ఉధృతిపై అధికారులు ఆరా తీశారు పాలేరు అలుగు ఉదృతంగా మారటంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు దంపతులు వరద ప్రవాహం ప్రవాహానికి కొట్టుకొని పోయారు ఈ దృశ్యం మంత్రి పొంగులేటిని కన్నీటి పర్వతం చేసింది… అంతకు ముందు తనతో ఫోన్లో మాట్లాడిన వారు ఇలా వరదలో కొట్టుకొని పోవడంపై మదన పడ్డారు ..

రెవిన్యూ మంత్రి పొంగులేటి కాలికి గాయం …ప్రధమ చికిత్స

రెవిన్యూ మంత్రి పొంగులేటి కాలికి గాయం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉదయం తన నియోజకవర్గ పరిధిలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ స్కిడ్ అయి కింద పడిపోయారు . దీంతో ఆయన కాలుకి గాయమైంది . అయినప్పటికీ ఆయన వెంటనే కాలుకి ప్రధమ చికిత్స చేయించుకుని తిరిగి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు పరామర్శించారు . వారికి అందుతున్న సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఖమ్మంనగరాన్ని అనుకుని వెళుతున్న మునేరు వరదలకు కరుణగిరి ప్రాంతంలో దాదాపు 90 శాతం ఇల్లు నీట మునిగాయి… ఒక్కసారిగా మున్నేరు వరదలు నివాసాల్లోకి చొరబడ్డాయి..దీంతో ఆ ప్రాంత ప్రజలంతా లబోదిబోమంటూ సురక్షిత ప్రాంతాల్లో తదలచుకుందామని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది …మున్నేరు ఇళ్లను ముంచడంతో ప్రజలు అధికారులపై ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేశారు .

ఖమ్మం బైపాస్ రోడ్ లో వాహనాలను నిలిపివేయడంతో అటు ఇటు సుమారు 10 కిలో మీటర్లు వరకు ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిచి పోయింది …సుదూర ప్రాంతాలకు పిల్లాపాపలతో వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు … మునేరు ఉద్రితికి ఖమ్మం జలదిగ్బంధనంలో ఉండటంతో మంత్రి హుటాహుటిన ఖమ్మం బయలుదేరి వచ్చారు …ఆయన కారు కాన్వాయ్ వెళ్లేందుకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో నడుచుకుంటూనే వెళ్లారు …మున్నేరు ప్రవాహాన్ని చూశారు …బాధితులతో మాట్లాడారు … తిరిగి సోమవారం ఉదయం ఆ ప్రాంతాలలో పర్యటించడం జరిగింది . అయితే బాధితులు మాత్రం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు తమకు సహాయం చర్యలు అందలేదని గగ్గోలు పెడుతున్నారు. ఒకపక్క వరద దిగ్బంధనంలో చిక్కుకున్న తమను పరామర్శించే నాధుడే కరువయ్యాడని వాపోతున్నారు . అంతేకాకుండా తమకు అన్నపానీయాలు లేక మలమల్లలాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో వెంటనే అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొంటున్నారు .కొందరైతే మంత్రులను ప్రభుత్వాన్ని టార్గెట్గా చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేమి ప్రభుత్వం అని నిలదీస్తున్నారు … మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిశారు .. తమ ఇళ్లలోకి వచ్చిన నీటి విషయంలో కనీసం అధికారి యంత్రాలను స్పందించకపోవడం పట్ల ఆగ్రా ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం తాము వరదలకు ప్రజలను అప్రమత్తం చేశామని , రేయింబవుళ్లు సహాయక చర్యల్లో నిమగ్నమవుతున్నామని పేర్కొంటున్నారు.

మంత్రి తుమ్మలకు 102 డిగ్రీల జ్వరం ..అయినా వరద ప్రాంతాల్లో పర్యటన

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని మకాం వేసి ఖమ్మం నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనకు 102 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ లెక్కచేయకుండా తిరిగారు .. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లన్నీ నీట మునిగి ప్రజలు ఆహాకారాలతో ఉన్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు ఆయన వివిధ కాలనీలో పర్యటించారు. ప్రధానంగా ప్రకాష్ నగర్ వద్ద బ్రిడ్జిపై మున్నేరు వరద ప్రవహించడంతో అక్కడ 9 మంది చిక్కుకున్నారు … వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు గంటలకు కొద్దీ గడవడంతో అక్కడ ఉన్న ప్రజలు మంత్రిపై తిట్లు శాపనార్దాలు పెట్టారు …హెలికాఫ్టర్ అన్నారు ..విమానం అన్నారు …ఏది రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు …సోమవారం కూడా వరద ప్రాంతాల్లో జ్వరంతోనే తుమ్మల పర్యటించారు …

హెూండా పై పొంగులేటి… స్కూటీలో ఆర్ ఆర్ ఆర్

  • ఖమ్మం రూరల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
  • బాధితులకు అండగా ఉంటామని భరోసా

ఖమ్మం రూరల్ : హెండా యూనికార్న్ ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నడుపుతూ…. స్కూటీలో ఆర్ ఆర్ ఆర్ వెనకాల కూర్చుని ఎడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు అతలకుతాలమైన ఖమ్మం రూరల్ మండల వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం పర్యటించారు. మండలంలోని నాయుడుపేట, జలగంనగర్, సాయి ప్రభాత్ నగర్ -1,2, టెంపుల్ సిటీ, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించారు. బాధితులను ఓదార్చారు. కొంతమంది మహిళలు వారి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఖచ్చితంగా బాధితులందరినీ ఆదుకుంటామని, ఏ ఒక్కరికి ఇబ్బందులు కలిగించబోమని మంత్రి పొంగులేటి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

ట్రాక్టర్ ఎక్కి ప్రయాణించి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

మీనవోలు నుంచి పెద్ద గోపారం వరకు ట్రాక్టర్ ఎక్కి వరద ఉధృతిని పరిశీలించిన డిప్యూటీ సీఎం

వాగులో గల్లంతై మృతి చెందిన సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం

అత్యంత క‌ఠిన ప‌రిస్థితుల మధ్య ట్రాక్టర్ ఎక్కి ప్రయాణించి ఎర్రుపాలెం మండలం లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ ఆదివారం రాత్రి పర్యవేక్షించారు.‌
మీనవోలు- పెద్ద గోపవరం గ్రామాల మధ్యన కట్టలేరు పొంగి పొర్లి రోడ్డు పైన వరద నీరు ప్రవహించడంతో మీనవోలు హనుమంతుని వాగు వద్ద  ట్రాక్టర్ ఎక్కి పెద్ద గోపవరం వైపు వెళ్లి డిప్యూటీ సీఎం పరిస్థితిని సమీక్షించారు. శనివారం వాగులో గల్లంతై మృతి చెందిన భవానిపురం గ్రామానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలిపారు. పెద్ద గోపారం భీమవరం, భవానిపురం లో పరిస్థితులను సమీక్షించారు. ఆ తరువాత అయ్యవారి గూడెం కు చేరుకొని ఇటీవల హైదరాబాద్ లో మృతి చెందిన మొండ్రు ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించారు.

Related posts

మన దగ్గర సహాయం పొందిన వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు …మాజీఎమ్మెల్యే కందాల

Ram Narayana

పాలేరులో చేపపిల్లలను వదిలిన మంత్రి పొంగులేటి!

Ram Narayana

నాదే సీటు …కందాల……పోటీ ఖాయం తుమ్మల …పొత్తులో మాదే…తమ్మినేని …

Ram Narayana

Leave a Comment