Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

వరద బాధితులకు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ భరోసా

వరద బాధితులందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, బైపాస్ రోడ్ లోని రామ్ లీల ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రం, జలగంనగర్ లోని మున్నేరు వరద ప్రదేశాలలో కొనసాగుతున్న సహాయక పనులను పర్యవేక్షించారు. వర్షం బీభత్సం కు బురదమైన కాలనీలలో అధికారులతో కలిసి పరిశీలించారు. జలగంనగర్ లోని ఎంపిడివో కార్యాలయం, స్ధానిక ప్రభుత్వ పాఠశాల వరద ముంపుతో బురదమైన గదులు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్ధానిక ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ, అనుకోని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఊహించని పరిణామాలు జరిగాయని, ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు పరిస్థితి ని చక్కదిద్దాడానికి చర్యలు తీసుకుందని, ధైర్యం కల్పించారు. రానున్న రెండురోజులు వర్షసూచన ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. వరద ప్రాంతాలలో పూర్వ పరిస్థితిని తెచ్చేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేస్తున్నామన్నారు. వరద ప్రభావం లేని వేర్వేరు గ్రామాల నుంచి రప్పించిన పారిశుధ్య సిబ్బంది సహాయక పనులలో పాల్గొంటున్నారని తెలిపారు. ఒకవైపు వర్షం అప్పుడప్పుడు పడుతున్న పారిశుధ్య కార్మికులు తమ విధుల్లో నిమగ్నమయి పనులు చేస్తున్నారని తెలిపారు. డోజర్ల ద్వారా రోడ్లపై పేరుకుపోయిన బురదను శుభ్రపరచడం, ట్యాంకర్ల ద్వారా నీళ్లు జల్లడం, అంటువ్యాధులు వ్యాపించ కుండా బ్లీచింగ్ పౌడర్, దోమల నియంత్రణకు ఫాగింగ్ లాంటి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. మున్నేరు వరదలతో ఉపశమనం కలుగుతున్న ప్రాంతాలలో నిత్యవసర సరుకులు, దుప్పట్లు, త్రాగునీరు సరఫరా అందిస్తున్నమని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇళ్లకు కొత్త విద్యుత్ మీటర్ల లను అమరుస్తున్నామని అన్నారు.

 అంతకుముందు నాయుడుపేటలోని రామ్ లీలా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన వరద పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. వరద ముంపుతో నిరాశ్రయులైన వారితో కలెక్టర్ ముచ్చటించారు. రుచికరమైన బోజనం, శుద్దమైన మంచినీరు, ఉదయం అల్పాహారం, టీ అందిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. మీకు కావాలసిన సౌకర్యాలు ఉన్నాయా అని వాకాబు చేశారు. వరద బాధితులు కల్పించిన వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. భాదితులు పూర్తిస్థాయిలో కొలుకునే వరకు పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. 

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పంచాయతీ అధికారిణి లత, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపిడిఓ కుమార్, ఎంఇఓ లు శ్రీనివాసరావు, శ్యాoసన్, అధికారులు తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారిచేయనైనది.

వరద బాధితులకు సహాయం కోసం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ స్వయంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బురదలోను నడుస్తూ తన షూస్ తానే తీసీ పట్టుకొని నడవడం చూస్తే ఆయన ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారు వరదల పట్ల ఆయన ఏ విధంగా చలించారు అనేది అర్థమవుతుంది .నిజంగా ఆయనకు పనిచేసే అధికారిగా మంచి పేరుంది. వారికి అందుతున్న సహాయం గురించి తెలుసు కుంటున్నారు.

Related posts

ఖమ్మం జిల్లా వార్తలు ……

Drukpadam

మరోసారి భయం గుప్పెట్లో ఖమ్మం

Ram Narayana

కాంగ్రెస్ లో టిక్కెట్ల కొట్లాట …అరుపులు కేకలతో దద్దరిల్లిన ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం

Ram Narayana

Leave a Comment