ఖమ్మం నగరం మరోసారి భయం గుప్పెట్లో విలవిలాడుతుంది నిన్నగాక మొన్న వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకా కోలుకోక ముందే మరో దెబ్బ తగిలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది .గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో భయంకర వాతావరణ ఏర్పడింది . మున్నేరు పరివాహక ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదలతో మొదటి ప్రమాద హెచ్చరికు చేరువైంది. దీంతో ప్రజలను ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని పోలీసులు పదేపదే లౌడ్ స్పీకర్ల ద్వార విజ్ఞప్తి చేస్తున్నారు .మంత్రులు సైతం తమ ముందస్తు పర్యటనలు రద్దు చేసుకుని వరద ప్రాంతాల పర్యటనలు నిమగ్నమయ్యారు. మున్నేరుకు మరోసారి ప్రమాదం పొంచి ఉన్నదని తెలియడంతో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హుటాహుటిన వచ్చి గత రాత్రి అంతా Khammam Munneru వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరవకేంద్రాలను సందర్శించారు. విషయం తెలుసుకున్న పునరావాస రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ నుండి హుటాహుటిన గత రాత్రి ఖమ్మం చేరుకున్నారు ఆయన పలు ప్రాంతాలను పర్యటించారు .అధికారులతో సమీక్ష నిర్వహించారు .వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఖమ్మంలోని మకాం వేసి ఖమ్మం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నిత్యం పర్యటన చేస్తున్నారు….ప్రజలకు ధైర్యం చెబుతున్నారు ఎలాంటి సహాయం అయినా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార యత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు…జిల్లాకు చెందిన ముగ్గర మంత్రులు వరద ప్రాంతాల పర్యటనలు నిమగ్నమయ్యారు
ఇప్పుడిప్పుడే తమ ఇళ్లకు చేరుకుని నివాసం ఉందామని ప్రయత్నం చేస్తున్న ప్రజలకు ఈ వార్త పిడుగు లాంటిది అయింది దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి
అధికార యంత్రాంగం అటు మంత్రులు పరుగులు పెడుతున్నారు .ఖమ్మం పై ప్రకృతి ప్రకోపంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నం అయ్యారు .కలెక్టర్ ,సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఇతర అధికారులు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారిని అప్రమత్తం చేస్తున్నారు .అధికారాంతరంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ప్రజలు సైతం ఎక్కడికి అక్కడ తమ ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు ప్రజా ప్రతినిధులు ఇతర స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు సహయ కార్యక్రమాల్లో నిమగ్నమైయ్యాయి.
రాజకీయాలు పక్కన పెట్టి ఈ విపత్కర పరిస్థితులు ప్రజలను కాపాడాలని, వారికి సహాయం అందించే పనిలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు
నిన్నటి నుండి వస్తున్న పుకార్లు ఖమ్మం వాసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి .మున్నేరు ఎగువన ఉన్న బయ్యారం పెద్ద చెరువు తెగిందని దాని వరద వల్ల ఖమ్మానికి పెద్ద ప్రమాదం ఉందని పుకార్లు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఖమ్మంలో ఆంక్షలు విధించారని రెండు బ్రిడ్జిలను పూర్తిగా మూసేశారని ఒక బ్రిడ్జిని మాత్రమే ప్రయాణానికి అనుకూలంగా మార్చి అదికూడా పరిమితమైన సంఖ్యలో వాహనాలను అనుమతిస్తున్నారని తెలియడంతో వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఖమ్మం పరిస్థితి పై ఆరాతిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఖమ్మంలో ఉన్న పరిస్థితిని అక్కడున్న మంత్రుల ద్వారా అధికారుల ద్వారా తెలుసుకుంటున్నారు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు .