Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

అమ్మకు వందనం …అమ్మే తన తొలిగురువు అన్న మాజీ ఎంపీ నామ

నామ ముత్తయ్య, వరమ్మ లకు మాజీ ఎంపీ నామ ఘన నివాళ్లు

బీఆర్‌ఎస్‌ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరరావు తల్లితండ్రులు స్వర్గీయ నామ ముత్తయ్య, వరలక్ష్మి లకు బుధవారం నాడు నామ నాగేశ్వరరావు ఘనంగా నివాళ్లు అర్పించారు నామ వరమ్మ నాల్గవ వర్ధంతి తో పాటుగా నేడు మహాలయ పక్ష అమావాస్య సందర్భంగా వారి పితృదేవతలను గుర్తుచేసుకుంటూ ఖమ్మం లోని వారి నివాసం వరలక్ష్మి నిలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అనంతరం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, వారి సోదరులు నామ రామారావు, నామ శీతయ్య, నామ కృష్ణయ్య లతో కలసి ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం లో నామ ముత్తయ్య, వరమ్మల స్మృతి వనం లో వారి విగ్రహాలకు నివాళ్లు అర్పించి అక్కడే కుటుంబ సభ్యులతో కలసి కొద్దిసేపు గడిపారు తమ మాతృమూర్తి అమ్మ పరమపదించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా, అమ్మ ప్రేమ, వారికి చేసిన మార్గనిర్దేశం ఎప్పటికీ వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

అమ్మే తన తొలి గురువు: నామ తన అమ్మే తొలి గురువన్నారు, అమ్మ దగ్గర నుంచే అందర్నీ ఆదరించడం, సమాజ సేవ చేయడం నేర్చుకున్నాను అన్నారు. చిన్నతనంలోనే వ్యవసాయ పనులకు వెళ్లడం ద్వారా రైతుకూలీల కష్టనష్టాలు తెలుసుకోవటంతో పాటు, చిన్నప్పటి నుండి అమ్మ పడ్డ ఇబ్బందులు చూశాను అన్నారు. నలుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్న పెద్ద కుటుంబాన్ని సాకడానికి అమ్మ అనేక పాట్లు పడ్డారని, ఆమె పడిన కష్టం వృధాగా పోలేదని బిడ్డలందరూ ఉన్నతంగా, ఉత్తమంగా ఎదిగామని చెప్పారు. తనకు అమ్మ అంటే ఎంతో ప్రేమని, అప్పట్లో ఏ ముఖ్యమైన పని మొదలు పెట్టినా.. అమ్మ కాళ్ళకు నమస్కరించిన తర్వాతనే ప్రారంభిస్తానని, ఎంత బిజీగా ఉన్నా.. అమ్మతో మాట్లాడిన తర్వాతనే తాను తన చేసుకునేవాడినని పేర్కొన్నారు.

అమ్మ కష్టం వృధాగా పోలేదు, అమ్మ ఇచ్చిన రెండు రూపాయలతో:

“గేదెల జీతగాడు లేడని, 8వ తరగతి తర్వాత నాన్న నన్ను చదువుమాన్పించి గేదెల వెంట పంపించారని, అప్పుడు తన తోటి వారు బడికి వెళుతుంటే.. బాగా చదువుకోవాలనే సంకల్పంతో అప్పుడు అమ్మ దగ్గర రెండు రూపాయలు తీసుకొని పాల్వంచలో వారి మామయ్య ఇంటికి వెళ్లి, ఆయన తోడ్పాటుతోనే ఇంటర్‌వరకు చదివారు. ఆ తర్వాత కేటీపీఎస్‌లో మూడున్నర కూలీగా ప్రస్థానం ప్రారంభించి, నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. చిన్నతనంలో తన పైన ఎప్పుడైనా నాన్న ముత్తయ్య కోప్పడితే, వెంటనే అమ్మ కలుగజేసుకొని నచ్చజెప్పేదన్నారు. ఇప్పటి వరకూ నామ జీవితంలో అణువణువూ అమ్మ ఉన్నారని, నాన్న 1995లో మరణించిన తర్వాత.. 1996లో నామ ముత్తయ్య మెమోరియల్‌ ట్రస్టు ప్రారంభించి, అమ్మే అన్నీ తానే నడిపించి ఎందర్నో ఆదుకున్నారు అని ఈ సందర్భంగా తెలిపారు.

సమాజ సేవలో తల్లి గొప్ప కృషి: సమాజ సేవతో ఎందరికో జన్మనివ్వని అమ్మగా మారింది. ఆపద లో వున్నవారికి నేనున్నాంటూ అండగా నిలిచింది. తన పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. కానీ.. వరలక్ష్మమ్మ మాత్రం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ తన బిడ్డలుగానే భావించి, సహాయ, సహకారాలు అందించడం ద్వారా వారి అభివృద్ధికి బాటలు వేసింది. వరలక్ష్మమ్మ నాడు తన భర్తతో పాటు రైతుగా అనేక కష్టాలు పడింది, ఆ కష్టాలను గుర్తు ఉంచుకొని, తరువాత పేద రైతుల కోసం బావులు తవ్వించడం, బోరు మోటార్లు పంపిణీ చేసి వారి కన్నీళ్లు తుడిచింది. ఎందరో పేద పిల్లలకు రూ. కోట్లు ఖర్చు చేసి విద్యా దానం చేసింది. సామాజిక సేవలో ఆమె కృషి అనిర్వచనీయం, 25 సంవత్సరాలుగా నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా లక్షలాది మందికి ఆపన్నహస్తం అందించింది. నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎందరికో జీవనోపాధిని అందించారు. వందలాది గ్రామాల్లో బోర్ల ఏర్పాటు, వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి ఎద్దడి ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా, రైతులకు పొలాల్లో బోర్లు, పొలాలకు వెళ్లటానికి డొంక, నూతన రహదారులు ఏర్పాటు, వరద, అగ్ని ప్రమాద బాధితులకు సహాయం, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, విద్యార్థులకు సహాయం, వికలాంగులకు సైకిళ్లు, ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ, కరోనా సమయం లో చేసిన సేవ కార్యక్రమాలు వంటి అనేక కార్యక్రమాలు ద్వారా నామ ట్రస్ట్ పేరు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

కుతుంబాక కుటుంబానికి మాజీ ఎంపీ నామ పరామర్శ

ఖమ్మం కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా తొలి అధ్యక్షుడు కుతుంబాక బసవనారాయణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఖమ్మం కార్పొరేషన్‌, మమత రోడ్ లో కుతుంబాక శ్రీరామ్ నివాసంలో బసవనారాయణ కుటుంబ సభ్యులను ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పరామర్శించారు. బసవనారాయణ పెద్ద కుమారుడు శ్రీనివాస్, చిన్న కుమారుడు డాక్టర్ శ్రీరామ్‌లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుతుంబాక బసవనారాయణతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నామ గుర్తు చేసుకున్నారు. నామ వెంట బి.ఆర్.ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాద్ రావు, తన్నీరు రవి, ప్రసాద్, నామ సేవ సమితి పాల్వంచ రాజేష్, కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Related posts

ఆటోవాలా అవతారమెత్తిన నామ …

Ram Narayana

మంత్రి పువ్వాడ అజయ్ వాహనంలో ఎన్నికల అధికారుల తనిఖీలు

Ram Narayana

నేను చీటర్ ను కాదు …ఫైటర్ ను …ఖమ్మం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పువ్వాడ..

Ram Narayana

Leave a Comment