Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎగ్జిట్ పోల్స్ ...రిజల్ట్స్ ...

ఎగ్జిట్ పోల్స్…హర్యానా హస్తనిదే అంటున్న మెజార్టీ సర్వేలు …

ఎగ్జిట్ పోల్స్…హర్యానా హస్తనిదే అంటున్న మెజార్టీ సర్వేలు …
కాశ్మిర్ లో ఏ పార్టీకిరాని స్పష్టత …హంగే అంటున్న సర్వేలు

  • జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి
  • జమ్మూ కశ్మీర్ కు మూడు విడతల్లో, హర్యానాకు ఒకే విడతలో పోలింగ్
  • ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్

జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో పోలింగ్ జరగ్గా, హర్యానాలో నేడు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబరు 8న వెల్లడించనున్నారు. 

ఇక, పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ విడుదల. హర్యానాలో కాంగ్రెస్ పార్టీదే హవా అని, జమ్మూ కశ్మీర్ లో సంకీర్ణం వస్తుందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫ సర్వే పేర్కొంది. హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది. 

జమ్మూ కశ్మీర్ లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని, ఉన్నవాటిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని పేర్కొంది. ఇంకా ఇతర మీడియా సంస్థలు కూడా తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

హర్యానా ఎగ్జిట్ పోల్స్…. (మొత్తం స్థానాలు 90)
1. పీపుల్స్ పల్స్
కాంగ్రెస్ 55
బీజేపీ  26
ఐఎన్ఎల్డీ 2-3
జేజేపీ  1

2. సట్టా బజార్ సర్వే
కాంగ్రెస్ 50
బీజేపీ 25

3. ఏబీపీ-సీ ఓటర్ సర్వే
బీజేపీ 78
కాంగ్రెస్ 8

4. న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ సర్వే
బీజేపీ 75
కాంగ్రెస్ 10

జమ్మూ కశ్మీర్ (మొత్తం సీట్లు 90)

1. పీపుల్స్ పల్స్
జేకేఎన్ సీ 33-35
బీజేపీ 23-27
కాంగ్రెస్ 13-15
జేకే పీడీపీ 7-11
ఏఐపీ 0-1
ఇతరులు 4-5

2. రిపబ్లిక్ మాట్రిజ్
బీజేపీ 25
కాంగ్రెస్ 12
ఎన్సీ 15
పీడీపీ 28
ఇతరులు 7

3. ఇండియా టుడే-సీ ఓటర్
ఎన్సీ కూటమి 11-15
బీజేపీ 27-31
పీడీపీ 0-2
ఇతరులు 0-1

Related posts

లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల… ప్రజల నాడి ఏం చెబుతోందంటే…!

Ram Narayana

అరుణాచల్ లో కమల వికాసం…సిక్కిం లో క్రాంతికారి మోర్చా జయకేతనం …

Ram Narayana

ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయి: డీకే శివకుమార్

Ram Narayana

Leave a Comment