Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

కాంగ్రెస్ వస్తే హర్యానా సీఎం ఎవరు ..?

సీఎం ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది …భూపేంద్ర హుడా
సెల్జా కూడా సీనియర్ నాయకురాలే
సూర్జేవాలా ఉన్నారు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో ఊహాగానాలు

హరియాణాలో పదేళ్ల భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలనకు తెరపడనుందని, కాంగ్రెస్ విజయం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి..✌️

మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 55కి పైగా సీట్లు కాంగ్రెస్‌ గెలుస్తుందని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ప్రధానంగా పార్టీ సీనియర్‌ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్‌ సూర్జేవాలాతో పాటు మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర హుడ్డా పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై భూపేంద్ర హుడ్డా స్పందించారు. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని భావిస్తున్నాం. బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అవినీతి పెరిగిపోయింది. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు” అని భూపేంద్ర తెలిపారు. ఇక కుమారి సెల్జా సీఎం కావడంపై భూపేంద్రను ప్రశ్నించగా, సీఎం అవుతానని చెప్పుకునే ప్రతి నాయకుడికి ఉందన్నారు. ఇక కుమారి సెల్జీ పార్టీ సీనియర్​ నాయకురాలు అన్న భూపేంద్ర సింగ్, అందుకే సీఎం పదవిపై ఆమెకు కూడా హక్కు ఉందన్నారు. అయితే అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Related posts

వికీపీడియాకు కేంద్రం నోటీసులు… ఎందుకంటే?

Ram Narayana

కొన్ని రకాల బంగారు ఆభరణాలు, వస్తువుల దిగుమతికి కేంద్రం నూతన విధానం!

Drukpadam

ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలు, ఎముకలతో ఢిల్లీలో నిరసనలు!

Ram Narayana

Leave a Comment