తెలంగాణాలో టీడీపీ బలోపేతానికి బాబు నజర్
టీడీపీలో చేరనున్న పలువురు మాజీలు..అధినేత చంద్రబాబుతో మంతనాలు …
హైద్రాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన
మల్లా రెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి , మాధవరం కృష్ణారావుల మంతనాలు
వీరితోపాటు మరి కొందరు చేరతారని ప్రచారం
ఖమ్మం జిల్లా నుంచి కూడా ఒక సీనియర్ నేత కూడా తిరిగి పార్టీలో చేరతారని ప్రచారం
టీడీపీని తెలంగాణాలో బలోపేతం చేయాలనీ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ద్రుష్టి సారించారు …అంతకు ముందు ఇక్కడ టీడీపీ వద్దనుకున్న చంద్రబాబు తెలంగాణ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు …అయితే వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేసేందుకు తెలంగాణాలో కూడా పార్టీ బలపడాలని ఆయన కోరుకుంటున్నారు … దేశంలోనే బలమైన నేతల్లో ఒకరుగా ఉన్న చంద్రబాబు దక్షణాది రాష్ట్రాల్లో కీలక వ్యక్తిగా మారాడు..రేపు కేంద్రంలో రాజకీయాలు ఎలా మారిన టీడీపీని బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ..ఏపీలో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం అధినేత తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడంతో టీడీపీ హవా కొనసాగుతుంది …దీంతో 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమితో పార్టీకి దూరమైనా టీడీపీ మాజీలు తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు … ఇటీవల ఏపీ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ,కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో టీడీపీలో చేరితే తమకు ఇబ్బందులు ఉండవని ఆలోచనలో తెలంగాణ నేతలు ఉన్నారు .. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పేనాయకుడుగా ఉండటంతో రాజకీయాల్లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ఇతర నేతలు టీడీపీని ఒక ప్లాటుఫారంలాగా ఉంచుకోవాలని ఆలోచనతో ఉన్నారు ..ఇప్పటికే పలువురు మాజీలు చంద్రబాబుతో టచ్ లోకి వచ్చారని విశ్వసనీయ సమాచారం …ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో పార్టీ బలోపేతానికి ద్రుష్టి పెడతానని వారంలో ఒకరోజు తెలంగాణ నేతలకు టైం ఇస్తానని హామీ ఇచ్చారు …తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దూకుడుగా వ్యవరించడంతో తమ కబ్జా భూములను రక్షించుకోవాలని అందుకు తమకు బలమైన రాజకీయ అండ అవసరమని భావిస్తున్న నేతలు బీఆర్ యస్ ను వీడి టీడీపీలో చేరడమే సరైందని అనుకుంటున్నారు …
ఖమ్మం జిల్లా నుంచి ఒక కీలక నేత కూడా టీడీపీలో తిరిగి చేరతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది …అదే నిజమైతే ఆయనకు కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం …
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.
తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో తన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేసిన ఆయన… హైదరాబాద్ అభివృద్ధి చేసింది వందకు వందశాతం చంద్రబాబేనని అన్నారు. తెలంగాణలో టీడీపీ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇక చంద్రబాబును కలిసిన మల్లారెడ్డి తన మనవరాలు శ్రేయరెడ్డి పెళ్లికి సీఎంను ఆహ్వానించారు. గతంలో మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీని వీడారు. మల్లారెడ్డి మనవరాలు పెళ్లి కారణంగా చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు టీడీపీ అధినేతను కలిశారు.