- ‘జియోఫైనాన్స్’ యాప్‌ను సరికొత్తగా ప్రారంభించిన రిలయన్స్
- హోమ్ లోన్స్ సహా అనేక ఆర్థిక సేవలను డిజిటల్‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ
- గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్, మైజియోలో అందుబాటులో యాప్
కస్టమర్లకు ఫైనాన్షియల్ సర్వీసులను అందించేందుకు రిలయన్స్ కంపెనీ ‘జియోఫైనాన్స్’ అనే కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ బీటా వెర్షన్‌ను మే 30, 2024న ప్రారంభించింది. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సరికొత్త మార్పులు, మరిన్ని నూతన సేవలతో పునరుద్దరించి ఈ యాప్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్, మైజియోలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలు, హోమ్ లోన్స్, ఆస్తులపై లోన్లతో పాటు పలు రకాల ఫైనాన్షియల్ ప్రొడక్టులు, సేవలను పొందవచ్చని కంపెన తెలిపింది.
ఈ యాప్ ద్వారా అందే సేవలు ఇవే..
కస్టమర్లు సేవింగ్స్‌తో పాటు రుణాలను కూడా పొందవచ్చునని రిలయన్స్ ఆర్థిక సేవల విభాగం ప్రకటించింది. సురక్షితమైన బ్యాంకింగ్ సేవల కోసం బయోమెట్రిక్ ప్రమాణాలతో ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్టు వివరించింది. డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో (జేపీబీఎల్) కేవలం 5 నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్‌ను తెరవవచ్చని వివరించింది.
ఈ యాప్‌పై అదనంగా యూపీఐ చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా చెల్లించవచ్చునని కస్టమర్లకు తెలిపింది. కస్టమర్లు వేర్వేరు బ్యాంకులకు సంబంధించిన తమ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లను సైతం తనిఖీ చేసుకోవచ్చునని వివరించింది. ఈ యాప్‌ల లైఫ్, హెల్త్, టూ-వీలర్, మోటర్ ఇన్సూరెన్స్‌తో పాటు మొత్తం 24 బీమా ప్లాన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఈ సేవలన్నీ డిజిటల్‌గానే అందుబాటులో ఉంటాయని వివరించింది.