Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

యూఎస్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా ఐదుగురు భార‌తీయుల దుర్మ‌ర‌ణం!

  • అమెరికాలోని రాండాల్ఫ్ స‌మీపంలో సోమ‌వారం సాయంత్రం దుర్ఘ‌ట‌న‌
  • మృతుల్లో ముగ్గురు ఏపీలోని ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వాసులు
  • రెండు వాహ‌నాలు ఒక‌దానినొక‌టి ఢీకొన‌డంతో ప్ర‌మాదం

అమెరికాలోని రాండాల్ఫ్ స‌మీపంలో సోమ‌వారం సాయంత్రం 6.45 గంట‌ల‌కు (యూఎస్ కాల‌మానం ప్ర‌కారం) ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు తెలుగువారు స‌హా ఐదుగురు ప్ర‌వాస భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో ఓ మ‌హిళ కూడా ఉన్నారు.

ముగ్గురు తెలుగువారు ఏపీలోని ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వాసులు. సౌత్ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహ‌నాలు ఒక‌దానినొక‌టి ఢీకొన‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు టెక్సాస్ ప‌బ్లిక్ సేఫ్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని అక్క‌డి ప్ర‌వాస భార‌తీయులు పేర్కొన్నారు. కాగా, ఈ దుర్ఘ‌ట‌న‌ను మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు ప్ర‌వాస భార‌తీయ ప్ర‌తినిధులు తెలిపారు. 

Related posts

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇకలేరు.. ధ్రువీకరించిన అధికారిక మీడియా…

Ram Narayana

కెనడాలో మంట‌ల్లో టెస్లా కారు.. న‌లుగురు భార‌తీయుల స‌జీవ‌ద‌హ‌నం…

Ram Narayana

అమెరికాలో బైక్ ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం…

Ram Narayana

Leave a Comment