Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

“లా ఫర్మ్”ఆఫీసును ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు …

హైద్రాబాద్ లో ప్రముఖ న్యాయవాది బర్మా చక్రపాణి ఏర్పాటు చేసిన “లా ఫర్మ్”అడ్వొకేట్స్ అండ్ లీగల్ కన్సెల్టెంట్స్ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు ప్రముఖ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర ప్రారంభించారు …కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి పాల్గొన్నారు ..ఈసందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ లీగల్ సమస్యల పరిష్కరానికి చక్కటి వేదికగా ఇది నిలవాలని ,పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆకాంక్షించారు …ప్రజల నమ్మకాన్ని చూరగొనడం వారికీ విశ్వాసం కల్గించడం అనేది ఏ రంగంలోనైనా కీలకమని అన్నారు …బర్మా చక్రపాణి వారి టీం ఇందులో తమ నైపుణ్యాన్ని వినియోగించుకుంటారని నమ్మకం ఉందని అన్నారు …

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు అన్నలు వద్దిరాజు కిషన్,వద్దిరాజు దేవేందర్,అల్లుళ్లు డాక్టర్ జే.ఎన్.వెంకట్,విజయ్,సమీప బంధువు ఆకుల రాజయ్య తదితరులు హాజరై చక్రపాణి,ఆయన సోదరుడు బర్మా నాగేశ్వరరావులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

అలాగే, కాంగ్రెస్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్, సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి,మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్లు,ప్రముఖ న్యాయవాదులు సీవీఎల్ నర్సింహారావు,చెరుకూరి శేషగిరిరావు,ఊసా రఘు,గుండ్లపల్లి శేషగిరిరావు,కొండూరి వినోద్, ఎంపీ వద్దిరాజు సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్,ముద్దు వినోద్ తదితరులు కార్యక్రమానికి హాజరై చక్రపాణి,ఆయన సోదరుడు నాగేశ్వరరావులకు అభినందనలు తెలిపారు ..

Related posts

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు: బాలరాజు

Ram Narayana

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం .. పోలీసులకు పట్టుబడిన కొరియోగ్రాఫర్!

Ram Narayana

హైదరాబాద్ నగర విస్తరణకు సకల చర్యలు తీసుకుంటాం …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

Leave a Comment