- ఏపీ నుంచి రిలీవ్ అయిన సృజన, హరికిరణ్, శివశంకర్
- తెలంగాణ నుంచి వాణీప్రసాద్, కరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి రిలీవ్
- ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగించాలన్న అధికారుల విజ్ఞప్తి… కోర్టులో దక్కని ఊరట
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఐఏఎస్‌లు సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రిపోర్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారికి క్యాట్, హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాలేదు. దీంతో అధికారులు ఇరు రాష్ట్రాల నుంచి రిలీవ్ అయ్యారు.
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లవలసిన వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి కూడా తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు.
ఏపీ నుంచి సృజన, హరికిరణ్, శివశంకర్ రిలీవ్ అయ్యారు. వీరు ముగ్గురు తెలంగాణ సీఎస్‌కు ఈరోజు రిపోర్ట్ చేశారు.