Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌కు ఈడీ సమన్లు!


రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌కు కేంద్ర దర్యాఫ్తు సంస్థ నుంచి నోటీసులు వచ్చాయి. భూకేటాయింపులకు సంబంధించి ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 22 లేదా 23వ తేదీన అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

అమయ్ కుమార్ బీఆర్ యస్ ప్రభుత్వం కాలంలో కీలకమైన జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు ..
మొదట్లో ఆయనకు మంచి పేరే ఉంది …పాలనాపరంగా నిర్ణయాలు వేగంగా తీసుకుంటారని అన్ని శాఖల మీద పట్టు ఉందని అభిప్రాయాలు ఉన్నాయి… తర్వాత కాలంలో ఆయన పాలకులు ఏది చెపితే అది గుడ్డిగా చేస్తున్నారనే విమర్శలను మూటగట్టుకున్నారు …కీలకమైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆయన కనుసన్నల్లో అనేక భూబదలాయంపులు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ కలెక్టర్ కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది …ఐఏఎస్ లో ఇది ఒక రకమైన వణుకు పుట్టిస్తుందనే చెప్పాలి …అయితే ఈడీ కక్షపూరితంగా కాకుండా నిజంగా తప్పులు జరిగి ఉంటె చర్యలు తీసుకోవాలి కానీ ప్రతి చిన్న విషయానికి పాలనలో జోక్యం చేసుకోవడం చేస్తే మంచిది కాదు …ఇలాంటివి ఇలానే కొనసాగితే అధికారులు పనిచేయడం ఇబ్బందికరంగా ఉంటుందని పలువురు ఐఏఎస్ లు అభిప్రాయపడుతున్నారు ..

Related posts

నిజాం ఆస్తులు కొట్టేసేందుకు ప్రయత్నం …ఏడో నిజాం మనమరాలు

Ram Narayana

గాంధీ భవన్ వద్ద ధర్నాలు చేస్తే పార్టీ నుండి సస్పెన్షన్: పార్టీ కేడర్‌కు రేవంత్ హెచ్చరిక..!

Drukpadam

ఉచిత బస్సు ప్రయాణం స్కీంలో 100 కోట్ల మంది ప్రయాణాలు !: పొన్నం ప్రభాకర్

Ram Narayana

Leave a Comment