Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు…

  • వైఎస్సార్ జిల్లాలో ఘటన
  • మాట్లాడాలి రమ్మంటూ పిలిచి దారుణానికి పాల్పడిన యువకుడు
  • 80 శాతం కాలిన గాయాలతో చావుబతుకుల్లో అమ్మాయి
  • నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలన్న సీఎం చంద్రబాబు

వైఎస్సార్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థినిపై మాజీ బాయ్ ఫ్రెండ్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడా విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్డాడుతోంది. నిందితుడు విఘ్నేశ్ కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు. 

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వెంటనే నిందితుడ్ని పట్టుకోవాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు… బాధితురాలి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ అమ్మాయికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య చికిత్స అందించేలా చూడాలని స్పష్టం చేశారు.

ఇక, ఘటన పూర్వాపరాల్లోకి వెళితే… ఆ అమ్మాయి, విఘ్నేశ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇటీవల ఆ యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ ఇంటర్ విద్యార్థినితో సంబంధం కొనసాగించాలని భావించాడు. నీతో మాట్లాడాలి అంటూ ఆ అమ్మాయిని కోరాడు. ఆ అమ్మాయి రాకపోతే చనిపోతానని బెదిరించాడు. దాంతో ఆ అమ్మాయి కాలేజీ నుంచి ఆటో ఎక్కి అతడు చెప్పిన చోటకు వచ్చింది. 

ఇద్దరూ కలిసి బద్వేలుకు 10 కిలోమీటర్ల దూరంలోని సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. అక్కడ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ… విఘ్నేశ్ ఆ అమ్మాయి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడికి సమీపంలోని పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు ఆ విద్యార్థిని అరుపులు విని అక్కడికి వచ్చి మంటలు ఆర్పారు. 

రైతుల రాకను గమనించి యువకుడు అక్కడ్నించి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు వచ్చి ఆ విద్యార్థినిని బద్వేలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపలోని రిమ్స్ కు తరలించారు. ఆ అమ్మాయి 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతుండడంతో, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. జిల్లా జడ్జి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. 

ఈ ఘటనపై వైఎస్సార్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ స్పందిస్తూ… నిందితుడి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. యువకుడు, విద్యార్థిని బద్వేలు పట్టణానికి సమీపంలోని ఒకే ప్రాంతానికి చెందినవారని తెలిపారు.

Related posts

యూట్యూబ్ వల్లనే పరీక్ష తప్పనని సుప్రీం లో విద్యార్ధి వింతవాదన …సుప్రీం సీరియస్ !

Drukpadam

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్ లో సింధు ఓటమి!

Drukpadam

Drukpadam

Leave a Comment