Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

గుట్కా, పాన్ మసాలాపై పశ్చిమ బెంగాల్ కీలక నిర్ణయం…

  • గుట్కా, పాన్ మసాలాలపై మరో ఏడాది నిషేధం పొడిగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన పశ్చిమ బెంగాల్ సర్కార్ 
  • ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ ఆదేశాలు అని పేర్కొన్న వైద్య ఆరోగ్య శాఖ

గుట్కా, పాన్ మసాలా అమ్మకాలు, తయారీపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుట్కా, పాన్ మసాలాపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొగాకు లేదా నికోటిన్‌తో తయారు చేసే గుట్కా, పాన్ మసాలా వంటి వాటిని తయారు చేసినా, అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా నేరంగా ప్రభుత్వం పరిగణించనుంది. 

నవంబర్ 7వ తేదీ నుంచి ఈ నిషేధం అమలు కానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 30 స్టాండర్డ్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ ఆదేశాలలో పేర్కొన్నారు. 

Related posts

ఇక దేశంలో కొత్తగా సైబర్ కమాండోలు 

Ram Narayana

అణుశక్తి సామర్థ్యం ఉన్న నాలుగవ జలాంతర్గామిని ఆవిష్కరించిన భారత్!

Ram Narayana

11 మంది మహిళలు కలిసి లాటరీ టిక్కెట్ కొంటే రూ.10 కోట్ల గెలుపు

Ram Narayana

Leave a Comment