Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మిస్టర్ కేటీఆర్… నీ అధికారం, అక్రమ సంపాదన శాశ్వతం కాదని తెలుసుకో: కోమటిరెడ్డి…

మిస్టర్ కేటీఆర్… నీ అధికారం, అక్రమ సంపాదన శాశ్వతం కాదని తెలుసుకో: కోమటిరెడ్డి
-నేడు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కేటీఆర్ పర్యటన
-సమాచారం అందించలేదన్న కోమటిరెడ్డి
-స్థానిక ఎంపీనైన తనను పట్టించుకోలేదని ఫైర్
-కేటీఆర్ రాజ్యాంగం చదువుకోవాలని హితవు

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన నియోజకవర్గంలో నేడు పర్యటనకు వచ్చిన కేటీఆర్, స్థానిక ఎంపీనైన తనకు సమాచారం అందించకపోవడం ఏంటని కోమటిరెడ్డి మండిపడ్డారు. తాను ఎంతో ఉన్నత విద్యావంతుడ్నని తల ఎగరేసే కేటీఆర్ ఓసారి భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ ఓ పిరికి పంద అని, విపక్షనేతలను ఎదుర్కొనే దమ్ములేదని విమర్శించారు. త్వరలోనే కేటీఆర్ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు పాతాళానికి తొక్కేస్తారని వ్యాఖ్యానించారు.

“మిస్టర్ కేటీఆర్… నీ అధికారం, నీ హోదా, నీ అక్రమ సంపాదన ఏదీ శాశ్వతం కాదన్న సంగతి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జీవితాంతం నీ వెంటే ఉంటాయని అనుకోవద్దు. ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకుంటావని, నీ పంథా మార్చుకుంటావని ఆశిస్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను గౌరవించడం ఎలాగో దయచేసి నేర్చుకో” అంటూ హితవు పలికారు.

 

Related posts

50 రోజుల్లో 5 రాష్ట్రాలు… 50వ రోజు 26 కిలోమీటర్లు నడిచిన రాహుల్!

Drukpadam

పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమికి సిద్దు ప్రధానభాద్యుడా ?

Drukpadam

తిరిగి బీఆర్ యస్ గూటికి చేరిన బొమ్మెర రామ్మూర్తి!

Drukpadam

Leave a Comment