వాళ్ల దగ్గర అంత బంగారం ఉందా?… మనకన్నా ఎంత ఎక్కువంటే?
- ఎన్ని ఆస్తులు ఉన్నా బంగారంపై తగ్గని మోజు
- ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ బంగారం నిల్వలు
- ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల అధీనంలో బంగారం
ఎంత డబ్బున్నా… ఎన్ని ఆస్తులున్నా… బంగారం మీద ఉండే మోజు వేరే. కేవలం ఆభరణాలుగా ధరించడానికి మాత్రమేకాదు. పెట్టుబడి కోసమూ బంగారం కొనడం ఎక్కువే. ఎందుకంటే ఎప్పటికీ బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది మరి. అంతేకాదు… అవసరమైతే భవిష్యత్తులో అమ్మేసుకుని డబ్బులుగా మార్చుకోవడానికి బంగారానికి మించినది లేదు. ఏ ఆస్తి ఉన్నా అమ్ముకుని డబ్బులు తీసుకోవాలంటే… దానికి కాస్త సమయం పడుతుంది. అదే బంగారమైతే నిమిషాల్లోనే సొమ్ముగా మార్చుకోవచ్చు.
సెంట్రల్ బ్యాంకుల్లో భారీగా బంగారం
అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులే కాదు… దేశాలు కూడా బంగారాన్ని నిల్వ చేసుకుంటుంటాయి. ఆ బంగారాన్ని ఆయా దేశాల ప్రభుత్వ సెంట్రల్ బ్యాంకుల ఆధీనంలో నిల్వ చేసుకుంటాయి. మన దేశంలో బంగారం నిల్వలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. మరి ప్రస్తుతం ఇలా వివిధ దేశాల వద్ద ఉన్న బంగారం నిల్వల లెక్క ఏమిటో చూద్దామా?
సెంట్రల్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాలివే.. | |
దేశం | బంగారం నిల్వలు |
అమెరికా | 8,133 టన్నులు |
జర్మనీ | 3,352 టన్నులు |
ఇటలీ | 2,452 టన్నులు |
ఫ్రాన్స్ | 2,437 టన్నులు |
రష్యా | 2,336 టన్నులు |
చైనా | 2,264 టన్నులు |
స్విట్జర్లాండ్ | 1,040 టన్నులు |
జపాన్ | 846 టన్నులు |
ఇండియా | 841 టన్నులు |
నెదర్లాండ్స్ | 612 టన్నులు |
టర్కీ | 585 టన్నులు |
తైవాన్ | 422 టన్నులు |
పోర్చుగల్ | 383 టన్నులు |
పోలాండ్ | 377 టన్నులు |
ఉజ్బెకిస్తాన్ | 365 టన్నులు |