- పాపవినాశనంలోని రెండు హోటళ్ల మధ్య భక్తుల ముందే పాటలు
- టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేసిన భక్తులు
- మహిళలను కొండ కిందికి తరలించి పోలీసులకు ఫిర్యాదు
తిరుమలలో ఇద్దరు మహిళలు అన్యమతానికి చెందిన గీతాలు ఆలపిస్తూ రీల్స్ చేయడం వివాదాస్పదమైంది. హాకర్లుగా జీవించే శంకరమ్మ, మీనాక్షి నిన్న పాపవినాశనంలోని రెండు హోటళ్ల మధ్య భక్తుల ముందు అన్యమత గీతాలు ఆలపిస్తూ ప్రచారం చేయడమే కాకుండా రీల్స్ చేశారు.
అప్రమత్తమైన భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని మహిళలు ఇద్దరినీ కొండ నుంచి కిందికి తరలించారు. అనంతరం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు శంకరమ్మ, మీనాక్షిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.