Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైకోర్టు వార్తలు

ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ నేత చిదంబరంకు భారీ ఊరట!

  • ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరం
  • ఆయనపై విచారణకు గతంలో, ట్రయల్ కోర్టు అనుమతి
  • తాజాగా, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎయిర్సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు గతంలో ఉత్తర్వులను ఇచ్చింది.

ఈ ఉత్తర్వులను చిదంబరం హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఆయనపై విచారణకు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది.

ఎయిర్సెల్ – మాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంపై ట్రయల్ కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌లు దాఖలు చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని చిదంబరం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా హైకోర్టు ఈ విచారణను నిలిపివేసింది.

Related posts

కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం…

Ram Narayana

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు… వైసీపీ నేతలకు హైకోర్టులో ఎదురుదెబ్బ !

Ram Narayana

ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై విచారణ… తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Ram Narayana

Leave a Comment