Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి …. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి …. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు సమర్పించిన అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకుని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి లు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

కలెక్టరేట్ లో చేయూత పించనులు, సదరం సర్టిఫికెట్ లకు సంబంధించిన దరఖాస్తు, ఫిర్యాదుల సహాయక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ తో కలిసి పరిశీలించి వచ్చిన దరఖాస్తులను రిజిస్టర్ లో ఎప్పటికప్పుడు నమోదు చేసి పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.

గ్రీవెన్స్ సెల్ లో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన క్రింద శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు బ్యాంకర్లు లోన్ల విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని, వీటిని పరిష్కరించి లబ్ధిదారులకు రుణాలు త్వరగా మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, లీడ్ బ్యాంక్ మేనేజర్ కు రాస్తు నిబంధనల ప్రకారం రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు.

బోనకల్ మండలానికి చెందిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రతినిధులు మండల కేంద్రంలో ఉన్న 3 మద్యం దుకాణాలలో మద్యం అధిక రేట్లను అరికట్టాలని, బెల్ట్ షాపులను నియంత్రించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కు రాస్తూ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఖమ్మం నగరం వేణుగోపాల్ నగర్ కు చెందిన ఎం. వెంకట నరసమ్మ తన ఇంటికి ఆన్ లైన్ పన్ను జనరేట్ కావడం లేదని, తమ ఇంటి నెంబర్ కూడా తప్పుగా నమోదు అయిందని, వీటిని సరి చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, మున్సిపల్ కమీషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

తిరుమలాయపాలెం మండలం రమణ తండా కు చెందిన ఎం. సునీత ఆశ వర్కర్ గా పని చేస్తున్నానని, ఆరోగ్య సమస్యల వల్ల మధ్యలో విధులకు హాజరు కాలేదని, ప్రస్తుత ఆరోగ్యం కుదుటపడిందని తనకు మరోసారి ఆశ వర్కర్ గా విధులలో చేర్చుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కు రాస్తూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి రాజేశ్వరి, కలెక్టరేట్ పరిపాలన అధికారిణి అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మరణంలోనూ వీడని ఏడడుగుల బంధం.. ఖమ్మంలో వృద్ధ దంపతుల మృతి

Ram Narayana

తాత గారి ఎన్నికల ప్రచారం లో మనవళ్ళు హల్చల్ ..

Ram Narayana

కాంగ్రెస్ లో టిక్కెట్ల కొట్లాట …అరుపులు కేకలతో దద్దరిల్లిన ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం

Ram Narayana

Leave a Comment