Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ ను గౌరవిస్తేనే… రేవంత్ ను గౌరవిస్తాం: కేటీఆర్ కండిషన్

  • రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన స్థితిలో కేసీఆర్ లేరన్న కేటీఆర్
  • తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎందుకు మార్చారని ప్రశ్న
  • అంబేద్కర్, పీవీ విగ్రహాలను రేవంత్ పట్టించుకోవడం లేదని విమర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన స్థితిలో తమ అధినేత కేసీఆర్ లేరని చెప్పారు. కేసీఆర్ ను రేవంత్ గౌరవిస్తేనే… రేవంత్ ను తాము గౌరవిస్తామని తెలిపారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఒకప్పుడు సోనియాను బలిదేవత అన్న రేవంత్… ఇప్పుడు ఆమెను తెలంగాణ తల్లి అంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎందుకు మార్చారని అడిగారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్ణయాలు మారిపోవాలా? అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారతమాత రూపాన్ని వాజ్ పేయి మార్చలేదని అన్నారు.

అంబేద్కర్, పీవీ నరసింహారావుల విగ్రహాలను రేవంత్ పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రేవంత్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అంటే రేవంత్ ఇంట్లో జరిగే కార్యక్రమం కాదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానం తమకు మ్యాటర్ కాదని… తెలంగాణ తల్లి తమకు మ్యాటర్ అని అన్నారు. రేవంత్ ప్రతిష్ఠిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహాన్నా? కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇందిరమ్మ పాలన నడవడం లేదని… ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తోందని చెప్పారు. 

అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సంక్షోభం, లగచర్ల ఘటన, గురుకులాలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. 

Related posts

కేసీఆర్ ను జైలుకు పంపాల్సిన లక్ష్యం మిగిలి ఉంది …మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Ram Narayana

కేసీఆర్ మూర్ఖంగా మాట్లాడుతున్నారు: తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో ఎమ్మెల్యే రాజయ్య భేటీ

Ram Narayana

Leave a Comment