Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

‘వన్ నేషన్ – వన్ ఎలెక్షన్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం…

  • మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం
  • జమిలికి ఆమోదముద్ర వేసిన కేబినెట్
  • ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

జమిలి ఎన్నికల(వన్ నేషన్ – వన్ ఎలెక్షన్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమిలికి ఆమోదముద్ర వేసింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దేశంలో వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండటం… దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందని ఎన్డీయే ప్రభుత్వం తొలి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. 

జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. 

తొలి దశలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని… ఆ తరువాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది.

Related posts

వర్షాలు ఎందుకు కురవడంలేదో దేవుడ్ని అడిగి చెప్పాలని కేంద్రాన్ని కోరిన ఆర్టీఐ కార్యకర్త

Ram Narayana

డేంజర్ మార్కును దాటేసిన యమున.. ముప్పు ముంగిట్లో ఢిల్లీ

Ram Narayana

టూరిస్టు మాదిరిగా అర్ధరాత్రి ఆటో ఎక్కిన లేడీ పోలీసు ఆఫీసర్.. ఆ తర్వాత జరిగిందిదే!

Ram Narayana

Leave a Comment