Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

త్వ‌ర‌లో 6వేల పోస్టుల‌తో మ‌రో మెగా డీఎస్‌సీ: భ‌ట్టి విక్ర‌మార్క‌…

  • ఈరోజు రాష్ట్ర‌వ్యాప్త ఒక‌రోజు హాస్ట‌ల్ త‌నిఖీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భ‌ట్టి విక్ర‌మార్క‌
  • దీనిలో భాగంగా ఖమ్మం, మ‌ధిర‌, బోన‌క‌ల్‌లోని సంక్షేమ‌, గురుకుల పాఠ‌శాలల‌కు వెళ్లిన భ‌ట్టి 
  • రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

నిరుద్యోగుల‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క తీపి క‌బురు చెప్పారు. త్వ‌ర‌లోనే 6వేల పోస్టుల‌తో మ‌రో మెగా డీఎస్‌సీ వేస్తామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించారు. ఈరోజు రాష్ట్ర‌వ్యాప్త ఒక‌రోజు హాస్ట‌ల్ త‌నిఖీ కార్య‌క్ర‌మంలో భాగంగా ఖమ్మం, మ‌ధిర‌, బోన‌క‌ల్‌లోని సంక్షేమ‌, గురుకుల పాఠ‌శాలల‌ను త‌నిఖీ చేశారు. 

ఈ సంద‌ర్భంగా నేటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూను అధికారికంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ ఛార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డార‌ని తెలిపారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా డైట్ ఛార్జీల‌ను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీల‌ను 200 శాతం పెంచామ‌న్నారు. అలాగే త్వ‌ర‌లో 6వేల పోస్టుల‌తో మ‌రో మెగా డీఎస్‌సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌న్నారు. 

Related posts

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు

Ram Narayana

బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటం మాత్రమే చేసింది: మంత్రి పొంగులేటి

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై అరెస్టు వారెంట్…

Ram Narayana

Leave a Comment