Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై రాహుల్ గాంధీ ప్రశంసలు!

  • ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే దిశగా సాగుతున్నామంటూ పొన్నం లేఖ
  • పొన్నం ప్రభాకర్‌కు తిరిగి లేఖ రాసిన రాహుల్ గాంధీ
  • ప్రజాప్రభుత్వం ఉత్తమ పనితీరు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానంటూ లేఖ

తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉత్తమ పనితీరును కనబరుస్తుందని, ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళతామని పేర్కొంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ అగ్రనేతకు లేఖ రాశారు.

తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

పొన్నం ప్రభాకర్ లేఖకు రాహుల్ గాంధీ ప్రత్యుత్తరం రాశారు. హామీలను అమలు చేసే దిశగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు అంటూ పొన్నంకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు. తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ప్రజా ప్రభుత్వంలో మంచి పనితీరు కొనసాగాలని ఆకాంక్షించారు.

Related posts

ఆక్రమించుకోవడానికి కర్ణాటక సీఎం సీటు ఖాళీగా లేదు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య!

Ram Narayana

కర్ణాటకలో సీబీఐకి నో ఎంట్రీ… సీఎం సిద్ధ రామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం!

Ram Narayana

యూపీ సీఎం యోగిని చంపేస్తాం.. ముంబై పోలీసులకు బెదిరింపు కాల్!

Ram Narayana

Leave a Comment