Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

రెక్కలు కూడా కనిపించనంత వేగం.. వేలెడంత పక్షి !

  • ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన పక్షుల్లో ఒకటి హమ్మింగ్‌ బర్డ్‌
  • వెనక్కి కూడా ఎగరగలిగిన, అత్యంత వేగంగా రెక్కలు ఆడించే ఏకైక పక్షి కూడా ఇదే..
  • పూలలో నుంచి తేనెను ఆహారంగా తీసుకోవడం మరో ప్రత్యేకత

ఏదైనా చిన్న విషయాన్ని చెప్పడానికి ‘పిట్ట పిల్లంత’ అని చెబుతుండటం సాధారణమే. ‘ఊర పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?’ అంటూ అతి చిన్నవైన పిచ్చుకలను గుర్తు చేసుకోవడమూ మామూలే. కానీ పిచ్చుకల కన్నా చిన్నగా ఉండే ‘హమ్మింగ్‌ బర్డ్‌’ గురించి తెలుసా? ఇవి కేవలం మన చేతి బొటన వేలు అంతే ఉంటాయి.

ప్రపంచంలోనే అత్యంత చిన్న పక్షుల్లో ఒకటైన దీనికి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. పక్షుల్లో అత్యంత వేగంగా రెక్కలు ఆడించగలిగేవి ఇవే. పక్షులేవైనా ఎగిరే సమయంలో కేవలం ముందుకు మాత్రమే వెళ్లగలవు. హమ్మింగ్‌ బర్డ్స్‌ మాత్రం ముందుకు, వెనక్కి ఎలాగైనా అప్పటికప్పుడు దిశను మార్చుకుంటూ ఎగరగలవు. అంతేకాదు.. పూల నుంచి తేనెను ఆహారంగా తీసుకోవడం కూడా దీని స్పెషాలిటీ.

అలాంటి హమ్మింగ్‌ బర్డ్స్‌ రెక్కలు కూడా సరిగా కనబడనంత వేగంగా ఆడిస్తూ… ఓ వ్యక్తి చేతిలోని పానీయాన్ని తాగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ‘ఎక్స్‌’లో దీనిని పోస్టు చేసిన మూడు, నాలుగు గంటల్లోనే లక్షకుపైగా వ్యూస్‌ వచ్చాయి. 

Related posts

అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్ ఎంత భయంకరంగా ఉందో ?

Ram Narayana

ఏనుగులు ఎలుకలను చూసి… ఎందుకు భయపడతాయి?

Ram Narayana

లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న భర్తకు భార్య ఫోన్.. అదృష్టం తలుపు తట్టింది!

Ram Narayana

Leave a Comment