హుస్నాబాద్ లో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్…
టి యు డబ్ల్యూ జే (iju) ఆధ్వర్యంలో కార్యక్రమం
రాష్ట్రంలో జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్న మంత్రి పొన్నం
సీఎం ఆదిశగా ఆలోచన చేస్తున్నారన్న మంత్రి
హుస్నాబాద్ పట్టణంలో 40 మంది జర్నలిస్టు మిత్రులకు సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.. గత నాలుగు సంవత్సరాలుగా టీయూడబ్ల్యూజే (iju) వీటి కోసం రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి విశేష కృషి చేసింది.. ఈరోజు టి యూ డబ్ల్యూ జె, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జర్నలిస్టులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత విలేఖరులందరికీ నివేషణ స్థలాలు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఇందులో టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నన్నె అజయ్ కుమార్, హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్, అధ్యక్షులు పిట్టల తిరుపతి, ప్రధాన కార్యదర్శి చల్ల రాజుతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు.