Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ముడా హౌసింగ్ స్కాంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చిట్

  • కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ముడా స్కాం
  • విచారణ జరిపిన లోకాయుక్త కోర్టు
  • సిద్ధరామయ్య అక్రమాలు చేశారనడానికి ఆధారాలు లేవని స్పష్టీకరణ
  • సిద్ధరామయ్య భార్యకు కూడా క్లీన్ చిట్

గత కొన్ని నెలలుగా కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపిన ముడా హౌసింగ్ స్కాంలో సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణ జరుపుతున్న లోకాయుక్త కోర్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనపై ఆరోపణల్లో పసలేదని తేల్చింది. సిద్ధరామయ్య అక్రమాలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అంతేకాదు, ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య భార్యకు కూడా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 

లోకాయుక్త కోర్టు సోమవారం నాడు తన నివేదికను కర్ణాటక హైకోర్టుకు సమర్పించనుంది. ముడా స్కాం ఆరోపణలతో విపక్ష బీజేపీ… సీఎం సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేయాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది.

Related posts

నెల రోజుల్లో టమాటా ద్వారా రూ.3 కోట్ల ఆర్జన.. పూణే రైతు కథ ఇది!

Drukpadam

మెకానిక్‌కు జాక్‌పాట్‌.. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతాలోకి రూ. 25కోట్లు!

Ram Narayana

ఆధార్ వివరాల ఉచిత అప్ డేట్ గడువును మరోసారి పొడిగించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment