- పుణే విమన్ నగర్ లో అనూహ్య ఘటన
- ఫస్ట్ ఫ్లోర్ నుంచి అమాంతం కింద పడిపోయిన కారు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
పుణేలోని విమన్ నగర్ లో జరిగిన ఓ అనూహ్య కారు ప్రమాద ఘటన తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. బహుళ అంతస్తులు ఉన్న పార్కింగ్ ఏరియాలో కారును ముందుకు తీయబోయి… డ్రైవర్ పొరబాటున రివర్స్ గేర్ వేశాడు. దాంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కారు అమాంతం కింద పడిపోయింది.
ఈ ప్రమాదం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అది కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.
వాహనం పార్కింగ్ గోడను పగులగొట్టి మరీ నేలకు గుద్దుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని సమాచారం. కాగా, ఈ ఘటన మరోసారి నివాస సముదాయాలలో భద్రతా చర్యల గురించి చర్చకు దారితీసింది.
విమన్ నగర్ లోని గేట్‌వే అపార్ట్‌మెంట్‌లో గత ఆదివారం ఉదయం ఈ ఘటన జరగగా… ఆలస్యంగా వీడియో బయటకు వచ్చింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.