Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వాసాలమర్రిలో కేసీఆర్ విందు భోజనం భలే పసందు !

వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం!
యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
దత్తత గ్రామం వాసాలమర్రిలో భోజనం
23 రకాల వంటకాలతో మెనూ
మాంసాహార, శాకాహార వంటకాలతో మెనూ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో పర్యటించడం తెలిసిందే. వేలమంది గ్రామస్తులతో కలిసి ఆయన భోజనం చేశారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో గ్రామంపై రాష్ట్రస్థాయిలో అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇటీవలే సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామ సర్పంచి అంజయ్యకు స్వయంగా ఫోన్ చేసి తన పర్యటనను నిర్ధారించారు. తాను వాసాలమర్రి గ్రామ ప్రజలతోనే భోజనం చేస్తానని తెలిపారు. దాంతో సీఎం కోసం 23 రకాల వంటకాలతో భారీ మెనూ సిద్ధం చేశారు.

చేపలు, కోడిమాంసం, వేటమాంసం, బోటీ, తలకాయ కూర, గుడ్లు, పప్పు, పచ్చిపులుసు, బిర్యానీ, పులిహోర, పాలక్ పన్నీర్, పలు రకాల చట్నీలు, మజ్జిగ పులుసు, సాంబారు, వంకాయ కూర, రసం, బంగాళాదుంప కర్రీ, మసాలా అప్పడాలు, స్వీట్లు రెండు రకాలు అందుబాటులో ఉంచారు. వీటిలో సీఎం కేసీఆర్ కొన్నింటితోనే భోజనం ముగించినట్టు తెలుస్తోంది.

‘కేసీఆర్‌ సార్‌ నా పక్కనే కూసుండి తిన్నరు, సంతోషమైంది’

వాసలమర్రిలో సహపంక్తి భోజనం గ్రామస్తులను పలకరిస్తున్న కేసీఆర్

దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు పర్యటించారు. గ్రామస్తులందరితో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. వాసాలమర్రికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానని కేసీఆర్‌ పేర్కొన్నారు. గ్రామ రూపరేఖలు మారాలని, అభివృద్ధి పనులు జరగాలన్నారు. అందరం కలిసి ఏడాది కల్లా బంగారు వాసాలమర్రి కావాలని ఆకాంక్షించారు

ఇక వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పక్కన కూర్చొని భోజనం చేసిన ఆకుల ఆగమ్మ అనే మహిళ ఆనందంత ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కేసీఆర్‌ సారు పెద్ద కొడుకులా తనను ఆదరించారని చెప్పుకొచ్చారు. సీఎం సారే స్వయంగా తనకు పండ్లు ఇచ్చారని, శాఖం వడ్డించారని తెలిపారుసీఎంతో తన సంభాషణ ఏంటో ఆగమ్మ మాటల్లోనే.. ‘నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. సారు నా పక్కనే కూసుండి అన్నం తిన్నడు. ఆయన తినే కూర కూడా నాకు వడ్డించిండు. నేను కూడా నీ కొడుకునే అని చెప్పిండు. నాకు చానా సంతోషమైంది. పింఛన్‌ వస్తుందా అని సారు అడిగిండు. మా ఆయనకు వస్తున్నది అని చెప్పినా. కొడుకులు కోడలు కన్నా కూడా మంచిగ.. సారు మా బాగోగులు తెలుసుకున్నరుఅని ఆగమ్మ ఆనందం వ్యక్తం చేశారు.

 

Related posts

ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక బదిలీ!

Drukpadam

హోలీ రోజూ డీజే పెట్టాడని యువకుడిని కొట్టి చంపిన పోలీసులు.. స్టేషన్ కు నిప్పు పెట్టిన ప్రజలు.. దాడిలో కానిస్టేబుల్ మృతి

Drukpadam

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం… రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Drukpadam

Leave a Comment