Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా న‌మోదు!


శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌లో భూకంపం సంభ‌వించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా న‌మోదైంది. సింధుపాల్‌చౌక్ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తన వెబ్‌సైట్‌లో సింధుపాల్‌చౌక్ జిల్లాలోని భైరవ్‌కుండలో తెల్ల‌వారుజామున‌ 2:51 గంటలకు (స్థానిక కాల‌మానం ప్రకారం)  భూకంప కేంద్రాన్ని గుర్తించిన‌ట్లు పేర్కొంది.

ఈ భూకంపం కార‌ణంగా నేపాల్‌లోని అనేక ప్రాంతాలలో ప్ర‌ధానంగా తూర్పు, మధ్య ప్రాంతాలలోని ప్రజలు భూప్ర‌కంప‌న‌ల‌కు లోనైన‌ట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ‌ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ప్రాథమిక స‌మాచారం. ప్రస్తుతం స్థానిక అధికారులు ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అటు భారత్‌, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి.

Related posts

ట్విట్ట‌ర్‌కు ప్రత్యామ్నాయంగా వ‌చ్చిన ‘కూ’ మూత‌!

Ram Narayana

 ముంబై ఉగ్రదాడుల కుట్రదారు హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావి మృతిని నిర్ధారించిన యూఎన్ఎస్‌సీ

Ram Narayana

అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలగడంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్…

Ram Narayana

Leave a Comment