హైద్రాబాద్ వార్తలు

హైదరాబాదులో ఓ పెళ్లి వేడుకలో దొంగల చేతివాటం…

  • పెళ్లి వేడుకల్లో ఇంటి యజమాని బిజీగా ఉండగా చోరీ 
  • ఏడున్నర లక్షల నగలు, నగదు అపహరణ
  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాధితుడి ఫిర్యాదు

సందట్లో సడేమియా అన్నట్లుగా పెళ్లి వేడుకలో దొంగలు తమ హస్తలాఘవం ప్రదర్శించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లో నివసిస్తున్న వ్యాపారవేత్త ఇంట్లో దాదాపు ఏడున్నర లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

ఇంటి యజమాని పెళ్లి వేడుకలో బిజీగా ఉండగా, డ్రెస్సింగ్ రూమ్‌లో తాళం తస్కరించి, దొంగలు తమ చేతివాటం ప్రదర్శించి నగదు, బంగారాన్ని అపహరించారు. దీనిపై ఇంటి పనిమనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Related posts

అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌డే చేసుకున్న రోజే విషాద ఘ‌ట‌న‌!

Ram Narayana

ఎయిరిండియా విమాన ప్రమాదం ఎఫెక్ట్: బేగంపేట ఎయిర్‌పోర్ట్ సమీపంలో భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం!

Ram Narayana

హైదరాబాద్‌లో ఘోరం.. స్కూటీని ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి…

Ram Narayana