Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి…

కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
తెలంగాణలోని కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం
రాహుల్, సోనియా గాంధీ నమ్మకాన్ని నిలబెడతా
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే
పార్టీలో భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కావు
సీనియర్ నేతల సహాయసహకారాలు కోసం జానా రెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్
జానారెడ్డిని కలిసిన అనంతరం షబ్బీర్ ఇంటికి
ఏఐసీసీ నిర్ణయాన్ని స్వాగతించిన మల్లు రవి

కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గత రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నాడు. బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగ యువత, రైతుల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నమ్మకాన్ని నిలబెడతానని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.

పార్టీలోని సీనియర్లు, పెద్దల సహకారంతో ముందుకు సాగుతానని రేవంత్ పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్లు అయిన జానారెడ్డి, హన్మంతరావు వంటి వారిని కలిసి వారి సలహాలు, సూచనలు, ఆలోచనల మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీలోని భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కావని కొట్టిపడేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని రేవంత్ విమర్శించారు. ఈటలను బీజేపీలోకి పంపింది కేసీఆరేనని అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమాలను చేపడతామని రేవంత్ పేర్కొన్నారు.

ఈటల రాజేందర్ ను బీజేపీ లో చేరేలా చేసిందే కేసీఆర్ అని , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగమేఘాలమీద ఢిల్లీ నుంచి రావడానికి ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేసింది కూడా ఎవరో అందరికి తెలిసిందేనని ఆరోపణలు గుప్పించారు. అందువల్ల రాష్ట్రంలో టీఆర్ యస్ బీజేపీ ఒకటేనని అన్నారు.

జానాను కలిసిన రేవంత్.. అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుందన్న మల్లు రవి

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డి గత రాత్రి పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిని కలిశారు. అనంతరం శాననమండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి కలిశారు. రేవంత్ రెడ్డి నియామకంపై పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. ఏఐసీసీ నిర్ణయాన్ని స్వాగతించారు. రేవంత్‌ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించి మంచి నిర్ణయమే తీసుకుందని అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ అప్రజాస్వామిక రాజకీయాలను ఎదిరించి పోరాడేందుకు కాంగ్రెస్ నాయకులంతా ఏకమై కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని అన్నారు. కాగా, రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

 

Related posts

జ‌గ‌న్‌కూ లేఖ రాసిన దీదీ… భేటీ ముగిశాక బ‌య‌టకొచ్చిన ఆహ్వానం!

Drukpadam

ఏపీ స్థానిక పోరులో బెదిరంపుల పర్వం …

Drukpadam

రాఘురామ కృషంరాజు కాళ్లకు తగిలినవి దెబ్బలుకాదు ఎడిమా…

Drukpadam

Leave a Comment