Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్….

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్
-డబ్బులకు పదవి అమ్ముకున్నారన్న వ్యాఖ్యలపై ఆగ్రహం
-ఇలాంటి విమర్శలు చేసే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరిక
-కోమటిరెడ్డి వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ కు పంపిన ప్రదేశ్ కాంగ్రెస్
-రంగంలోకి దిగిన మాణిక్యం ఠాకూర్ ,బోసురాజు
-రాష్ట్ర నేతలతో ఫోన్ సంభాషణ … పార్టీ పై వ్యాఖ్యలు చేస్తే సహించమని వార్నింగ్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిచయం అక్కరలేని పేరు …. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు …. భవనగిరి పార్లమెంట్ సభ్యుడు …. టీపీసీసీ రేసులో ఉండి పదవి దక్కక పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. … ప్రత్యేకంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై అవినీతి ఆరోపణలు అంటగట్టారు …. ఓటుకు నోటు లాగానే మాణిక్యం ఠాకూర్ ను కొనుగోలు చేసి రేవంత్ రెడ్డి పదవి తెచుకున్నారనేదానిపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది .

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం అనేక మందిని కలిసి విస్తృత అభిప్రాయం సేకరణ చేసిన తరువాతనే అధ్యక్షుడి ని ఎంపిక చేసిన విషయం తెలిసినప్పటికీ అసత్యాలు ప్రచారం చేయడంపై పార్టీ హైకమాండ్ చాల సీరియస్ గా ఉంది.

రేవంత్ రెడ్డి పార్టీ మారాడని , ఓటుకు నోటు కేసులాగానే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా కొన్నారని , ఇంచార్జి అమ్ముడు పోయాడని , కాంగ్రెస్ కార్యాలయం తెలుగు దేశం కార్యాలయంగా మారుతుందని , తాను గాంధీ భవన్ మెట్లు వెక్క బోనని, రేవంత్ రెడ్డి ఎంపికలో చంద్రబాబు జోక్యం ఉన్నదంటూ విమర్శలు చేయడం పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించటమేనని పార్టీ నేతలు పేర్కొంటున్నారు .

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకులూ మల్లు రవి , షబ్బీర్ అలీ లు స్పందించారు . వెంకట రెడ్డి తనకు పదవి రాకపోవడంపై భాదతో ఉన్నారన్నారనే విషయాన్నీ అర్థం చేసుకోవచ్చునని కానీ పార్టీ హైకమాండ్ పై ఇంచార్జి పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని హితవు పలికారు .కోమటిరెడ్డి మాటలపై జగ్గారెడ్డి కూడా స్పందించారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి కు పదవి రాకపోవడం పై ఆయన భాదను అర్థం చేసుకోవచ్చునని అన్నారు .అయితే ఒకసారి అధిష్టానం నిర్ణయం తీసుకున్న తరువాత దాన్నిఅందరు ఫాలో కావాల్సిందేనని అన్నారు.

 

Related posts

బండి సంజయ్ అద్భుతంగా మాట్లాడతారు..మోదీ ప్రశంసలు..

Drukpadam

గాంధీ భవన్ వద్ద ధర్నాలు చేస్తే పార్టీ నుండి సస్పెన్షన్: పార్టీ కేడర్‌కు రేవంత్ హెచ్చరిక..!

Drukpadam

ఈ నెల 12న పొంగలేటి ప్రకటన.: మల్లు రవి 

Drukpadam

Leave a Comment