ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ …!
మాటలు జారితే ఇబ్బంది పడతారు
మంత్రులను నియమించేది అధిష్టానమే
ప్రజల్లో ఉంటె అంతా మంచే జరుగుతుందని భరోసా ..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు …కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని తప్పు పట్టారు …ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు …మంత్రి పదవులపై కామెంట్స్ చేస్తే చేసిన వారికే నష్టం జరుగుతుందని గుర్తుంచుకోవాలని ఒక రకంగా సూచనతో కూడిన హెచ్చరిక చేశారు …మంత్రి పదవులపై మల్లగుల్లాలు పడుతున్న అధిష్టానం ఎవరికీ ఇస్తే ఏమి తంటానో అనే పద్దతిలోనే ఉంది …అందుకే ఎప్పుడో భర్తీ కావాల్సిన మంత్రి పదవులు సంవత్సరం ధాటిని భర్తీ చేయలేక పోతున్నారు …ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు ..అధిష్టానం మీదకు నెట్టి తమకు ఏమి పట్టనట్లు ఉండటంపై కూడా చర్చలు జరుగుతున్నాయి…కొందరు సీనియర్లు పార్టీలో అనేక కష్ట నష్టాలకోర్చి ఉన్న నిన్నమొన్న పార్టీలోకి వహ్సిన వారిని అందలం వెక్కించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు …సీనియర్ నేత జీవన్ రెడ్డి లాంటి వారు నేను ఎవరికన్నా తక్కువ రేవంత్ రెడ్డి కన్నా నా లేక భట్టి కన్నా నా అంటున్నారు …మంత్రి పదవికి తాను అన్ని విధాలా అర్హుడనని మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు ..ఇప్పటికే డజను మంది లైన్లో ఉండగా మరో అరడజను మంది తమకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు …అందువల్లనే సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రవేట్ హోటల్ లో ఏర్పాటు చేసిన సి ఎల్ పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు … మంత్రులు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది నా చేతుల్లో లేదని అంతా అందిస్తాం చేసుకుంటుందని స్పష్టం చేశారు ..ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటె అంతా మంచే జరుగుతుందని అన్నారు … సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ,ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు …
కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలపై ఫైర్ …


ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి వికర్మర్క్ , రెవెన్యూ ,గృహనిర్మాణ ,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు …ఎవరు ఏమి మాట్లాడిన చట్టం తన పని తాను చేసుకొని పోతుందని భట్టి అన్నారు … ఇది ఆయన మాటలు కావని వారి గురువుగారు కేసీఆర్ మాటలుగానే పరిగణించాల్సి వస్తుందని పొంగులేటి అన్నారు…
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాను: కొత్త ప్రభాకర్ రెడ్డి

- కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగాలని కేసీఆర్ కూడా కోరుకుంటున్నారన్న ఎమ్మెల్యే
- ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదని స్పష్టీకరణ
- ఇక ముందు కూడా చేయబోమన్న కొత్త ప్రభాకర్ రెడ్డి
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు పూర్తికాలం కొనసాగాలని తాను కోరుకుంటున్నానని బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగాలని తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కూడా ఆకాంక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని తాము ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఆ ప్రయత్నాలు చేయబోమని తేల్చి చెప్పారు. గజ్వేల్లో మాత్రమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ భూదందాలు జరిగినా ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని కొంతమంది తమతో చెప్పారని కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన మరోసారి స్పందించారు.