konda Surekha
తెలంగాణ వార్తలు

వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికైనా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని తాను అన్నటువంటి వ్యాఖ్యలను కొంత మంది పూర్తిగా వక్రీకరించారని మంత్రి సురేఖ(Minister Konda Surekha) అన్నారు.  అవినీతి చేయకుండానే కేటీఆర్, కవితకు ఇన్ని ఆస్తులు వచ్చాయా? అని సురేఖ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని  మంత్రుల పని తీరును ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదన్న మంత్రి ఈ మొత్తం ఇష్యూ మీద ఈరోజు వీడియో ద్వారా మరిన్ని వివరాలు తెలియజేస్తానని కొండా సురేఖ పేర్కొన్నారు.

Related posts

నికార్సైన కమ్యూనిస్టుని,ఎమ్మెల్యే పోస్ట్ కోసం తలవంచను…ప్రభుత్వంపై కూనంనేని ఆగ్రహం

Ram Narayana

కేసీఆర్ వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు : కవిత

Ram Narayana

జర్నలిస్ట్ శ్రీనివాస్ కుటుంబానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ )అండ

Ram Narayana