గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికైనా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని తాను అన్నటువంటి వ్యాఖ్యలను కొంత మంది పూర్తిగా వక్రీకరించారని మంత్రి సురేఖ(Minister Konda Surekha) అన్నారు. అవినీతి చేయకుండానే కేటీఆర్, కవితకు ఇన్ని ఆస్తులు వచ్చాయా? అని సురేఖ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పని తీరును ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదన్న మంత్రి ఈ మొత్తం ఇష్యూ మీద ఈరోజు వీడియో ద్వారా మరిన్ని వివరాలు తెలియజేస్తానని కొండా సురేఖ పేర్కొన్నారు.

previous post