ఆంధ్రప్రదేశ్

కొమ్మినేని అరెస్ట్ పై జగన్ సీరియస్ – రేపు ఇదే, మర్చిపోకండి..!!

సాక్షి చానల్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పైన మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అరెస్ట్ ను తప్పు బట్టారు. కొమ్మినేని నిర్వహించే చర్చలో జర్నలిస్టు క్రిష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల పైన కేసులు నమోదయ్యాయి.

క్రిష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. చర్చ నిర్వహించిన కొమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ వ్యవహారం పైన తొలిసారి స్పందించిన జగన్ సోషల్ మీడియా ద్వారా కీలక వ్యాఖ్యలు చేసారు.

అరాచకానికి కేరాఫ్

జగన్ తన పోస్టులో.. “ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతు న్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా @ncbn గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారిని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని..” ఆరోపించారు.

వక్రీకరిస్తూ

దీనికి కొనసాగింపుగా.. ” సహజంగా ఒక డిబేట్‌ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్‌లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబుగారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిగారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టారని చెప్పుకొచ్చారు.

రెండింతలు అవుతుంది

కొమ్మినేని నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తు న్నట్లు తెలిపారు. చంద్రబాబుగారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి..” జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.

Related posts

తెలంగాణాలో కాంగ్రెస్ సునామి… బీఆర్ యస్ ,బీజేపీ ఎంఐఎంలు కొట్టకపోవడం ఖాయం ….రాహుల్ గాంధీ!

Ram Narayana

శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర‌.. జితేంద‌ర్‌రెడ్డి, డీకే అరుణ‌ల పాత్ర‌పై విచార‌ణ‌…

Drukpadam

పద్మ’ అవార్డులు ప్రకటించిన కేంద్రం….

Drukpadam