తెలంగాణ వార్తలు

ఊహాగానాలకు చెక్ … మంత్రివర్గ ప్రక్షాళనపై రేవంత్ రెడ్డి క్లారిటీ

రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి యేడాదిన్నర  తర్వాత ముగ్గురుతో క్యాబినేట్ విస్తరణ చేపట్టారు.ఈ నేపథ్యంలో తెలంగాణలో పూర్తిగా మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి మీడియాకు  క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో మంత్రివర్గ ప్రక్షాళన లాంటిది ఏమి ఉండదని చెప్పుకొచ్చారు. మంత్రుల శాఖల కేటాయింపుపై జరుగుతున్న ప్రచారానికి  సీఎం రేవంత్ రెడ్డి ఎండ్ కార్డ్ వేశారు. అందరు అనుకున్నట్టు మంత్రి వర్గ ప్రక్షాళన ఉండదు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నా దగ్గర ఉన్న శాఖలను కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పట్లో శాఖల ప్రక్షాళన ఉండదని క్లారిటీ ఇచ్చారు. పాత మంత్రుల శాఖలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. ఈసారి క్యాబినేట్ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్.. తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారు.  మరోవైపు ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త వివేక్ వెంకట స్వామికి క్యాబినేట్ లో బెర్త్ ఇచ్చారు.  తెలంగాణ ఎన్నికల  సమయంలో ఆయన క్యాబినేట్ తీసుకుంటామనే హామితోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకోవైపు బీసీల నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో  చోటు కల్పించారు. ఈయనకు రేవంత్ రెడ్డి హామి మేరకు క్యాబినేట్ లో చోటు కల్పించారు. అయితే రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన హోం, విద్యా, మున్సిపల్, సాధారణ పరిపాలన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్‌  వంటి శాఖలున్నాయి. వాటిలో ఏ శాఖలను ఈ ముగ్గురికి కేటాయిస్తారనేది చూడాలి. 

Related posts

అంబర్‌పేట పైవంతెనను ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరి

Ram Narayana

జిమ్ చేస్తూ గాయ పడ్డ కేటీఆర్

Ram Narayana

మెదక్‌లో అమానుషం.. పని ఇస్తామని నమ్మించి.. మహిళపై అత్యాచారం.. ప్రాణాలు కోల్పోయిన బాధితురాలు

Ram Narayana