ఆంధ్రప్రదేశ్

32 ఏళ్ళ న్యాయపోరాటం…తండ్రి మరణానికి కారకులైన వారికీ శిక్ష పడేలా చేసిన కూతురు …!

డిఎస్పీ స్థాయిలో ఉన్న తండ్రిని తోటి పోలీసులే చంపేస్తే తండ్రికి జరిగిన అన్యాయం కోసం ఆరు నెలల కూతురు 32 ఏళ్ళు పోరాటం చేసి దోషులకు ఎలా శిక్ష వేసిందో తెలుసా…?
ఈమె పేరు కింజల్ సింగ్ ఈమెకు ఆరు నెలలు వయసున్నప్పుడు ఆమె తల్లి రెండో బిడ్డకు జన్మనిచ్చింది.ఆ టైంలో కరుడుగట్టిన క్రిమినల్స్ ఒక గ్రామంలో ఉన్నారని చెప్పి ఈమె తండ్రిని అక్కడికి రప్పించి తోటి పోలీసులే నకిలీ ఎన్కౌంటర్లో కాల్చి చంపి అతనితోపాటు 12 మంది గ్రామస్తులను చంపేశారు. ఈమె తల్లి వీవాదేవి ఇది నకిలీ ఎన్కౌంటర్ అని చెప్పి కోర్టు చుట్టూ తిరిగి తిరిగి తన భర్తకు జరిగిన అన్యాయం గురించి పోరాడుతూ.. కింజల్ సింగ్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఆమె తల్లి కూడా క్యాన్సర్ తో మరణించింది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని కష్టపడి చదివి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించింది డిగ్రీ పూర్తి చేసింది కింజల్. తన చెల్లి ప్రాజల్ సింగ్ తో కలిసి ఒక రూమ్ తీసుకుని సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి దేశంలోనే 25వ ర్యాంకును సాధించింది. కలెక్టర్ అయ్యాక తనకున్న పలుకుబడిన వాడి గ్రామస్తులతో CBI అధికారులతో మాట్లాడి కేసు కావలసిన సాక్ష్యాలను సంపాదించి కోర్టుకు సమర్పించి ముగ్గురు పోలీసులకు మరణశిక్ష మరో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష విధించేలా చేసి కంటే కూతుర్నే కనాలి అని నిరూపించింది.

Related posts

దేశంలో జనాభా తగ్గుతోంది.. మంచిది కాదంటున్న నిపుణులు!

Drukpadam

స్వలింగ వివాహాలను గుర్తించబోమన్న కేంద్రం!

Drukpadam

అమ‌రావ‌తిపై రైతుల ప‌క్షాన ఏపీ ప్ర‌భుత్వంపై కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ వేశాం: బీజేపీ ఎంపీ జీవీఎల్‌

Drukpadam