వరంగల్ కాంగ్రెస్ లో ముదురుతున్న విభేదాలు …హైకమాండ్ సీరియస్
కొండాదంపతుల వ్యవహారంపై ఐదుగురు ఎమ్మెల్యేల రుసరుస
కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు
ఈ వ్యహారాలపై కమిటీ వేయాలని ఏఐసీసీ ఆదేశం …మల్లు రవికి భాద్యతలు
వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు ముదురుతున్నాయి…ప్రధానంగా జిల్లాకు చెందిన మంత్రి సురేఖ ఆమె భర్త కొండా మురళి వ్యహరిస్తున్న తీరుపై జిల్లాకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రుసరుసలాడుతున్నారు ..ప్రతి నియోజకవర్గంలో మంత్రి ఆమె భర్త జ్యోక్యం చేసుకుంటూ తమను ఇబ్బందులకు గురిచేయడంపై నెత్తి నోరు మొత్తుకుంటున్నారు ..పార్టీకి కొండాదంపతులు కావాలో మేము కావాలో తేల్చుకోండని ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు మోర పెట్టు కున్నారు ..విషయం హైకమాండ్ దాక వెళ్లడంతో జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై కమిటీ వేయాలని ఏఐసీసీ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం ..ఈ భాద్యతలను సీనియర్ కాంగ్రెస్ నేత నగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి అప్పగించినట్లు తెలుస్తుంది …
కొండా దంపతులపై కఠినచర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన ఎమ్మెల్యేలలో నాయిని రాజేందర్ రెడ్డి,రేవూరి ప్రకాశ్ రెడ్డి,కడియం శ్రీహరి,గండ్ర సత్యనారాయణ, నాగరాజు,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఉన్నారు ..
ఇదేమి పాపం … మేము ఎమ్మెల్యేలం మా నియోజకవర్గాల్లో కొండాదంపతులు జ్యోక్యం చేసుకొని మమ్ములను ఇబ్బందులకు గురి చేస్తున్నారు …ప్రతి చోట గ్రూప్ రాకెజీయాలను ప్రోత్సహిస్తూ పార్టీకి నష్టం జరిగేలా వ్యహరిస్తున్నారు …ఇదే విధంగా కొనసాగితే పార్టీ బలహీనపడటం ఖాయమని వారు తేల్చి చెప్పారు .. కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలా? మేము కావాలా? తేల్చి చెప్పండి అల్టిమేటం ఇచ్చారు …
కొండా సురేఖ,కొండా మురళీ వరంగల్ లోని అన్ని నియోజకవర్గాల్లో తల దూర్చి,అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు …పార్టీ దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ..