Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీతో మ‌ళ్లీ క‌ల‌వ‌బోం: ఉద్ధ‌వ్ థాక‌రే స్పష్టీకరణ!

బీజేపీతో మ‌ళ్లీ క‌ల‌వ‌బోం: ఉద్ధ‌వ్ థాక‌రే స్పష్టీకరణ!
-శివసేన, బీజీపీ మ‌ళ్లీ క‌లవ‌బోతున్నాయంటూ ఊహాగానాలు
-ప్ర‌చారాన్ని ఖండించిన ఉద్ధ‌వ్
-బీజేపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో నానాయాగీ చేస్తున్నార‌ని వ్యాఖ్య‌
-వారి తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటిదని ఆగ్ర‌హం

మహారాష్ట్ర లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న శివసేన తిరిగి తన పాత మిత్రుడు అయిన బీజేపీ తో చేతులు కలపబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే కూటమి ఏర్పుటులో కీలక సూత్రధారి , మరాఠీ యోధుడు , ఎన్సీపీ నేత శరద్ పవర్ స్పందించారు. మహా ఆఘాది కూటమి ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ప్రకటించారు. అయితే ఇటవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసిన తరువాత ఈ వార్తల వేగం పెరిగింది. రోజు ఏదోఒక వార్త బీజేపీతో కలవడంపై హల్చల్ చేస్తునండి. ఈ నేపథ్యంలో నేత ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే స్వయంగా స్పందించారు. తాము బీజేపీ తో ఎట్టి పరిస్థితుల్లో కలవబోమని స్పష్టం చేశారు.

మ‌హారాష్ట్రలో శివ‌సేన‌, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో ఎన్డీయేలో కొన‌సాగిన శివ‌సేన మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌ అనంత‌రం ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా, బ‌య‌ట‌కు వ‌చ్చేసి కాంగ్రెస్, ఎన్సీపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కొన్ని రోజులుగా శివసేన, బీజేపీ మ‌ళ్లీ క‌లవ‌బోతున్నాయంటూ ఊహాగానాలు వ‌స్తున్నాయి.

ఈ ప్ర‌చారాన్ని తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక‌రే ఖండించారు. ఇవి నిరాధారమైన వార్తలని ఉద్ధవ్ అన్నారు. బీజేపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో నానాయాగీ చేస్తున్నార‌ని, వారి తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటిదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ అనుచితంగా ప్రవర్తించిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించిన విష‌యం తెలిసిందే. కాగా, బీజేపీ మహారాష్ట్ర‌ నేతలు కూడా శివ‌సేన‌తో క‌ల‌వ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. శివ‌సేన‌తో మ‌ళ్లీ క‌లుస్తామంటూ వ‌స్తోన్న వార్త‌ల‌ను కొట్టిపారేశారు.  అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనేది ఉంది కదా ? అని కొందరు అంటున్నారు.

 

Related posts

ప్రధాని పదవికి గౌరవం ఉంది …దానికి మచ్చ తేవద్దు మోడీకి మాజీప్రధాని మన్మోహన్ చురకలు!

Drukpadam

జులై 7న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకారం…

Drukpadam

సాగర్ బరిలో సానుభూతికే కేసీఆర్ మొగ్గు

Drukpadam

Leave a Comment