Shamshabad Airport
వాతావరణం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల దారి మళ్లింపు

శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను అధికారులు దారిమళ్లించినట్లు సమాచారం. విమానాశ్రయం పరిసరాల్లో వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయం పరిసరాల్లో నిన్నటి నుంచి ప్రతికూల వాతావరణం నెలకొందని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రావాల్సిన విమానాలలో కొన్నింటిని బెంగళూరుకు మరికొన్నింటిని విజయవాడకు మళ్లించినట్లు పేర్కొన్నారు. లఖ్‌నవూ, కోల్‌కతా, ముంబై, జయపుర నుంచి వచ్చే వాటిని బెంగళూరుకు డైవర్ట్‌ చేయగా.. బెంగళూరు నుంచి వచ్చిన విమానాన్ని విజయవాడలో ల్యాండ్ చేయించినట్లు తెలిపారు.

Related posts

దంచి కొడుతున్న వర్షాలు …పొంగిపొర్లుతున్న జలాశయాలు

Ram Narayana

ఆకాశంలో సునామీ .. పోర్చుగల్ బీచ్‌లో భయపెట్టిన వింత మేఘం

Ram Narayana

అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు … తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు

Ram Narayana